News August 28, 2024

కడపలో పారిశ్రామిక హబ్.. 54వేల జాబ్స్: కేంద్రం

image

AP: కడప జిల్లా కొప్పర్తిలో 2,596 ఎకరాల్లో పారిశ్రామిక హబ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. రూ.2,137 కోట్ల వ్యయంతో ఏర్పాటు కానున్న ఈ హబ్‌లో 54 వేల మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. కర్నూలు(D) ఓర్వకల్లులో 2,621 ఎకరాల్లో రూ.2,786కోట్ల వ్యయంతో ఇండస్ట్రియల్ హబ్ రానుందని, దీని ద్వారా 45 వేల మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు.

Similar News

News September 18, 2024

SECగా రాణి కుముదిని, విజిలెన్స్ కమిషనర్‌గా గోపాల్

image

TG: రాష్ట్ర ఎన్నికల సంఘం(SEC) కమిషనర్‌గా రిటైర్డ్‌ IAS రాణి కుముదినిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఈ ప్రతిపాదనకు గవర్నర్ జిష్ణుదేవ్ ఆమోదం తెలిపారు. రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్‌గా విశ్రాంత IAS ఎంజీ గోపాల్‌ను నియమించింది. ఇద్దరూ మూడేళ్లపాటు పదవుల్లో కొనసాగనున్నారు. రాణి కుముదిని 1988 IAS బ్యాచ్ కాగా గోపాల్ 1983 IAS బ్యాచ్. వీరిద్దరూ కేంద్ర, రాష్ట్ర సర్వీసుల్లో 30 ఏళ్లకుపైగా పనిచేశారు.

News September 18, 2024

నేడు ఏపీ క్యాబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ

image

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ సచివాలయంలో మంత్రివర్గ భేటీ జరగనుంది. నూతన మద్యం పాలసీ, చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లకు ఆమోదం తెలపనుంది. పోలవరం, అమరావతికి కేంద్ర సహాయం, వరద నష్టం, పరిహారం, ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై చర్చించనుంది. అలాగే కూటమి ప్రభుత్వ 100 రోజుల పాలనలో మంత్రుల గ్రాఫ్‌ను సీఎం వెల్లడించనున్నారు.

News September 18, 2024

మద్యం వ్యాపారం ప్రైవేటుకే అప్పగింత

image

AP: ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న మద్యం వ్యాపారాన్ని ప్రైవేటుకే అప్పగించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. 3,396 షాపులను నోటిఫై చేయనుంది. గీత కార్మికుల కోసం 396 దుకాణాలను కేటాయిస్తారు. ఏ రాష్త్ర వ్యక్తయినా దరఖాస్తు చేసుకుంటే లాటరీ ద్వారా లైసెన్సులు ఇస్తారు. ఇవాళ క్యాబినెట్ భేటీలో చర్చించి, ఈ నెల 22, 23 తేదీల్లో కొత్త పాలసీపై ఉత్తర్వులిస్తారు. OCT4, 5 నాటికి కొత్త విధానం అమల్లోకి రానుంది.