News August 28, 2024
TGలో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ.. 1.74లక్షల జాబ్స్: కేంద్రం
TG: సంగారెడ్డి(D) జహీరాబాద్‌లో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. 3,245 ఎకరాల్లో రూ.2,361కోట్ల వ్యయంతో అభివృద్ధి చేయనున్న ఈ స్మార్ట్ సిటీకి రూ.10వేల కోట్ల పెట్టుబడులు రానున్నట్లు తెలిపారు. దీని ద్వారా 1.74 లక్షల మందికి ఉపాధి లభిస్తుందన్నారు.
Similar News
News September 8, 2024
శ్రీవారి దర్శనానికి ఎంత సమయమంటే?
AP: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. 20 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 83,960 మంది భక్తులు దర్శించుకోగా హుండీ ఆదాయం రూ.2.96 కోట్లు సమకూరింది.
News September 8, 2024
మున్నేరుకు వరద.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
TG: మహబూబాబాద్, ఖమ్మంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మున్నేరుకు వరద పోటెత్తింది. ప్రస్తుత నీటి మట్టం 16 అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇప్పటికే ఖమ్మం సిటీలో పరీవాహక ప్రాంత ప్రజలను పోలీసులు అప్రమత్తం చేశారు. ప్రభావిత కాలనీల బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు. కాగా వరద 24 అడుగులు దాటితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు.
News September 8, 2024
నా X అకౌంట్ ఎవరో హ్యాక్ చేశారు: బ్రహ్మాజీ
వైసీపీ చీఫ్ జగన్‌ను ట్యాగ్ చేస్తూ చేసిన <<14049130>>ట్వీట్<<>> వైరలవ్వడంపై నటుడు బ్రహ్మాజీ స్పందించారు. తన X అకౌంట్‌ను ఎవరో హ్యాక్ చేసినట్లు పేర్కొన్నారు. ఆ ట్వీట్‌కు తనకు ఎలాంటి సంబంధం లేదని, దీనిపై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.