News October 25, 2024
INDvsNZ: గిల్ ఔట్
గాయం కారణంగా న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో ఆడలేకపోయిన భారత బ్యాటర్ గిల్ రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు. 72 బంతులు ఎదుర్కొని 30 పరుగులు చేసి శాంట్నర్ బౌలింగ్‌లో LBW రూపంలో పెవిలియన్ చేరారు. భారత్ ప్రస్తుతం 50/2గా ఉంది. క్రీజులో జైస్వాల్(20), కోహ్లీ(0) క్రీజులో ఉన్నారు. KL.రాహుల్ స్థానంలో గిల్ జట్టులోకి వచ్చిన విషయం తెలిసిందే.
Similar News
News November 13, 2024
టూత్‌పేస్ట్‌పై ఈ కలర్ కోడ్స్ ఏంటి?
నిత్యం వినియోగించే టూత్ పేస్టుల్లో కలర్ కోడ్స్ ఉండటం గమనించారా? ఇవేమీ డిజైన్ కోసం వేసినవి కాదు. మొత్తం నాలుగు రంగుల స్ట్రిప్స్‌ను టూత్ పేస్ట్ కవర్‌పై చూడవచ్చు. ఇందులో బ్లూ రంగు న్యాచురల్ & మెడిసిన్స్‌తో కూడినదని సూచిస్తుంది. రెడ్ కలర్ న్యాచురల్ & కెమికల్స్ యాడ్ చేసినదని, గ్రీన్ కలర్ ఉంటే న్యాచురల్‌గా తయారుచేసిందన్నమాట. ఇక స్ట్రిప్‌పై బ్లాక్ కలర్ ఉంటే అది పూర్తిగా కెమికల్స్‌తో చేసిందని అర్థం.
News November 13, 2024
కులగణన గేమ్ చేంజర్ కాబోతోంది: CM రేవంత్
TG: రాష్ట్రంలో చేపట్టిన కులగణన గేమ్ చేంజర్ కాబోతోందని CM రేవంత్ అన్నారు. సంక్షేమ ఫలాలు అర్హులైన పేదలకు చేరాలంటే ప్రభుత్వం వద్ద సరైన గణాంకాలు ఉండాలని అభిప్రాయపడ్డారు. అసలు గణాంకాలు లేకుంటే అసలైన అర్హులకు న్యాయం చేయలేమని అన్నారు. అందుకే కులగణన చేపట్టామని, ఇదొక మైలురాయిగా మిగులుతుందని ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో ఇంటర్వ్యూలో ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
News November 13, 2024
నవంబర్ 13: చరిత్రలో ఈ రోజు
* 1780: భారత దేశంలో సిక్కు సామ్రాజ్య స్థాపకుడు రంజిత్ సింగ్ జననం.
* 1935: సినిమా నేపథ్య గాయని పి.సుశీల జననం.
* 1973: భారత స్వాతంత్ర్య సమరయోధురాలు బారు అలివేలమ్మ మరణం.
* 1990: మొట్టమొదటి వెబ్ పేజీ తయారీ.
* 2002: ప్రజా కవి, పద్మవిభూషణ గ్రహీత కాళోజీ నారాయణరావు మరణం.(ఫొటోలో)