News September 5, 2024
మరుగుదొడ్ల నిర్మాణంతో తగ్గిన శిశు మరణాలు!

స్వచ్ఛ భారత్ మిషన్ కింద పెద్ద ఎత్తున మరుగుదొడ్ల నిర్మాణం వల్ల దేశంలో 60-70 వేల శిశు మరణాలు తగ్గినట్టు ఒక అధ్యయనం అంచనా వేసింది. USలోని ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ పరిశోధకుల బృందం దేశంలో 20 ఏళ్ల డేటాను అధ్యయనం చేసింది. టాయిలెట్ వినియోగం 10% పాయింట్ల మేర మెరుగు వల్ల శిశు మరణాల రేటు 0.9 పాయింట్లు, 5 ఏళ్లలోపు వారిలో 1.1 పాయింట్లు తగ్గిందని పేర్కొంది.
Similar News
News July 8, 2025
GREAT: 67 ప్రాణాలు కాపాడిన కుక్క..!

హిమాచల్ ప్రదేశ్ వరదల్లో ఓ కుక్క 67 మంది ప్రాణాలను కాపాడింది. గత నెల 30న అర్ధరాత్రి మండి జిల్లా సియాథిలో ఓ కుక్క అరుపులు విని గ్రామస్థుడు నరేంద్ర నిద్ర లేచాడు. ఆ సమయంలో ఇంట్లోని గోడకు పగుళ్లు, నీరు లీక్ కావడం గమనించి గ్రామస్థులందరినీ అప్రమత్తం చేశాడు. వారు వెంటనే గ్రామాన్ని విడిచారు. కాసేపట్లోనే కొండచరియలు విరిగిపడి ఇళ్లన్నీ నేలమట్టమయ్యాయి. కుక్క అరుపు వల్ల 20 కుటుంబాలు సురక్షితంగా బయటపడ్డాయి.
News July 8, 2025
క్రికెట్ ఇండోర్ స్టేడియంలో ఎందుకు ఆడరు?

క్రికెట్ పిచ్, ఔట్ ఫీల్డ్, భారీ సంఖ్యలో వచ్చే ప్రేక్షకులకు ఇండోర్ స్టేడియం సరిపోదు. పిచ్, బౌలింగ్‌లో స్వింగ్, సీమ్ వాతావరణ మార్పులను బట్టి మారుతూ ఉంటాయి. కొన్ని దేశాల్లో ఇండోర్ క్రికెట్ ఆడుతున్నారు. అయితే వాటి రూల్స్ భిన్నంగా ఉంటాయి. ICC మాత్రం అధికారికంగా ఇలాంటి మ్యాచ్‌లు నిర్వహించట్లేదు. పైకప్పును బంతి తాకితే దాన్ని ఎలా పరిగణించాలనే విషయంలో గందరగోళం కూడా దీనికి కారణం.
News July 8, 2025
చలాన్లు పెండింగ్‌లో ఉంటే లైసెన్స్ సస్పెండ్?

TG: ట్రాఫిక్ చలాన్లు చెల్లించనివారిపై చర్యలకు రవాణాశాఖ సిద్ధమైంది. మూడు నెలల పాటు పెండింగ్‌లో ఉంటే లైసెన్స్ సస్పెండ్ చేయాలన్న పోలీసుల ప్రతిపాదనలపై త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఈ నిర్ణయంతో ట్రాఫిక్ రూల్స్ అతిక్రమణకు కళ్లెం వేయడంతో పాటు భారీగా ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం భావిస్తోంది. గత 7 నెలల్లో పదేపదే ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన 18,973 మంది లైసెన్స్‌లను అధికారులు సస్పెండ్ చేశారు.