News February 10, 2025

టర్మినేషన్‌ను సీక్రెట్‌గా ఉంచేందుకు బస్సుల్ని అడ్డంగా పెట్టిన ఇన్ఫీ: MC

image

ట్రైనీస్‌ను తొలగించేటప్పుడు <<15417347>>ఇన్ఫీ<<>> వ్యవహరించిన తీరును నెటిజన్లు విమర్శిస్తున్నారు. ‘ఆ రోజు క్యాంపస్‌లో Finacle ఎంప్లాయీస్, US క్లైంట్స్ ఉన్నారు. మమ్మల్ని టెర్మినేట్ చేయడం వాళ్లు చూడొద్దని బస్సులను అడ్డంగా పెట్టారు. ఆ వైపు వెళ్లకుండా షీల్డుగా ఎస్కార్టులను పెట్టారు. ఒక్కొక్కరినీ పిలిచి టెర్మినేట్ చేశారు. ఇది క్రూరత్వం. ట్రైనీస్ నిజం చెప్పేందుకు భయపడ్డారు’ అని ఒకరు చెప్పినట్టు మనీకంట్రోల్ తెలిపింది.

Similar News

News January 3, 2026

ఐఐటీ ఢిల్లీలో అప్రెంటిస్ పోస్టులు

image

<>ఐఐటీ<<>> ఢిల్లీ 29 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీ, డిప్లొమా అర్హత గల వారు JAN 19 వరకు అప్లై చేసుకోవచ్చు. అడ్మినిస్ట్రేషన్, అకౌంట్స్, ఐఐటీ హాస్పిటల్, ఎస్టేట్& వర్క్స్, హాస్టల్ విభాగంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు NATS పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. గ్రాడ్యుయేట్లకు నెలకు రూ.15వేలు, డిప్లొమా అప్రెంటిస్‌లకు రూ.12వేలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: home.iitd.ac.in/

News January 3, 2026

కాళేశ్వరంపై మోజు.. పాలమూరుపై నిర్లక్ష్యం: ఉత్తమ్

image

TG: మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుపై అధిక మోజు చూపి, కావాలనే పాలమూరు-రంగారెడ్డిని నిర్లక్ష్యం చేశారని మంత్రి ఉత్తమ్ మండిపడ్డారు. ‘జూరాల నుంచి అయితే రోజుకు 2.8 టీఎంసీల చొప్పున 60 రోజుల్లో 121 టీఎంసీల నీటిని తరలించే అవకాశం ఉండేది. కానీ సోర్స్‌ను జూరాల నుంచి కాకుండా శ్రీశైలానికి మార్చడం వల్ల కేవలం 68 టీఎంసీలే తీసుకునేలా చేశారు. దీని వల్ల అంచనా వ్యయం రూ.85వేల కోట్లకు చేరింది’ అని తెలిపారు.

News January 3, 2026

చుక్క నీటిని వదులుకోం: ఉత్తమ్ కుమార్

image

TG: కృష్ణాజలాల్లో చుక్క నీటిని కూడా వదులుకోబోమని అసెంబ్లీలో PPT సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హయాంలో నీటి విషయంలో రాష్ట్రానికి అన్యాయం చేశారని మండిపడ్డారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు 99శాతం చేశామన్న కేసీఆర్ వ్యాఖ్యలు అబద్ధమని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాకే ప్రాజెక్టు పనులు పునరుద్ధరించినట్లు చెప్పారు.