News April 10, 2024
కర్ణాటక పోలీసులకు ఇన్ఫోసిస్ భారీ విరాళం

కర్ణాటక పోలీసులకు ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ భారీ విరాళాన్ని అందించింది. సైబర్ క్రైమ్‌పై పోరాటానికి గాను రూ.33 కోట్లను బెంగళూరు పోలీసులకు ఇచ్చింది. సంస్థ సీఎస్ఆర్ విభాగం ఈ విషయాన్ని ప్రకటించింది. అంతేకాక సీఐడీ, భారత సమాచార భద్రత మండలితో ఒప్పందాల్ని కుదుర్చుకున్నట్లు తెలిపింది. సైబర్ క్రైమ్ దర్యాప్తు కేంద్రంతో తమ అనుబంధాన్ని మరో నాలుగేళ్ల పాటు పొడిగించుకున్నట్లు వెల్లడించింది.
Similar News
News February 5, 2026
విజయభేరి మోగించిన పాలమూరు జట్టు

సీనియర్ ఉమెన్స్ ఇంటర్ డిస్ట్రిక్ట్ T-20టోర్నీలో ఆదిలాబాద్‌పై మహబూబ్‌నగర్ జట్టు సంచలన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆదిలాబాద్ జట్టు 20 ఓవర్లలో 90/7 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన మహబూబ్‌నగర్ జట్టు 10.2 ఓవర్లలో 91/0 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించి విజయ భేరి మోగించింది. అక్షర రాథోడ్-45*, ఆర్యాని-25* రన్స్ చేయగా అనిత, మేఘన చెరో 2 వికెట్లు తీశారు.
News February 5, 2026
సూపర్ కప్ విజేత గోదావరి లెజెండ్స్

అనంతపురం RDT స్టేడియంలో జరిగిన AP సూపర్ కప్–2026 ఫైనల్‌లో సిటాడెల్ గోదావరి లెజెండ్స్ ఎఫ్‌సీ విజయం సాధించింది. కోరమండల్ ఎఫ్‌సీతో జరిగిన పోరులో పెనాల్టీ షూటౌట్ ద్వారా 3–0 గోల్స్ తేడాతో గెలుపొందింది. గోల్‌కీపర్ సచిన్ ఝా అద్భుత ప్రదర్శన చూపారు. విజేతకు రూ.10 లక్షల బహుమతి లభించింది. క్రీడాకారులు రాజా దేబ్‌నాథ్, విగ్నేష్, రమేశోర్ గోల్స్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించగా కలెక్టర్ ఆనంద్ అభినందించారు.