News April 10, 2024

కర్ణాటక పోలీసులకు ఇన్ఫోసిస్ భారీ విరాళం

image

కర్ణాటక పోలీసులకు ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ భారీ విరాళాన్ని అందించింది. సైబర్ క్రైమ్‌పై పోరాటానికి గాను రూ.33 కోట్లను బెంగళూరు పోలీసులకు ఇచ్చింది. సంస్థ సీఎస్ఆర్ విభాగం ఈ విషయాన్ని ప్రకటించింది. అంతేకాక సీఐడీ, భారత సమాచార భద్రత మండలితో ఒప్పందాల్ని కుదుర్చుకున్నట్లు తెలిపింది. సైబర్‌ క్రైమ్ దర్యాప్తు కేంద్రంతో తమ అనుబంధాన్ని మరో నాలుగేళ్ల పాటు పొడిగించుకున్నట్లు వెల్లడించింది.

Similar News

News February 7, 2026

ఐటీకి హైటెక్ సిటీ.. క్వాంటమ్‌కి అమరావతి: CBN

image

AP: దేశంలోని మొట్టమొదటి క్వాంటమ్ వ్యాలీకి అమరావతిలో పునాది పడటం గర్వంగా ఉందని సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. ‘ఐటీ రెవల్యూషన్‌కి హైటెక్ సిటీ ఏం సాధించిందో, క్వాంటమ్ టెక్నాలజీలో అమరావతి అచీవ్ చేస్తుంది. మోదీ నాయకత్వంలో ఆత్మనిర్భర్ వికసిత్ భారత్ వైపు అడుగులేస్తున్నాం’ అని పేర్కొన్నారు. క్వాంటమ్ టెక్నాలజీలో నోబెల్ సాధిస్తే రూ.100Cr ఇస్తామని ‘క్వాంటమ్ వ్యాలీ’ ప్రారంభోత్సవ సభలో చెప్పారు.

News February 7, 2026

AI ముప్పు: స్కిల్లింగ్ ఒక్కటే మార్గం.. CEA నాగేశ్వరన్

image

AI వల్ల ఉద్యోగాలకున్న ముప్పును ఎదుర్కొనేందుకు భారత్ ఇప్పుడిప్పుడే సిద్ధమవుతోందని CEA అనంత నాగేశ్వరన్ తెలిపారు. AI ప్రభావం తక్కువగా ఉండే హెల్త్‌కేర్, టూరిజం, ఆరెంజ్ ఎకానమీ వంటి రంగాలపై దృష్టి పెట్టాలని సూచించారు. స్కిల్లింగ్ ద్వారానే ఈ సవాలును ఎదుర్కోవచ్చని పేర్కొన్నారు. ప్రైవేట్ పెట్టుబడుల విషయంలో కేవలం ప్రోత్సాహకాలు సరిపోవన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి ఇంకా కొనసాగే ఛాన్స్ ఉందన్నారు.

News February 7, 2026

ఈ 2 నెలలు దోమలతో జాగ్రత్త

image

ఫిబ్రవరి, మార్చి నెలల్లో దోమల బెడద మరింత పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. నవంబర్ నుంచి జనవరి వరకు దోమలు గుడ్లు పెట్టగా ఇప్పుడు ఉష్ణోగ్రతలు పెరిగి వాటి సంఖ్య పెరుగుతోందని తెలిపారు. దోమలు తెల్లవారుజామున, సాయంత్రం వేళల్లో అత్యంత చురుగ్గా ఉంటాయని, గాలిలో తేమ వల్ల కుడతాయని చెప్పారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడటం, కిటికీలు మూయడం లాంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.