News January 23, 2025
హైదరాబాద్‌లో ఇన్ఫోసిస్ విస్తరణ

హైదరాబాద్ పోచారంలో ఐటీ క్యాంపస్ విస్తరణకు అంగీకరిస్తున్నట్లు ఇన్ఫోసిస్ సంస్థ ప్రకటించింది. ఈ మేరకు దావోస్‌లో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. రూ.750 కోట్లతో మొదటి దశ విస్తరణ చేపట్టనుండగా, దీని ద్వారా 17వేలకు పైగా ఉద్యోగాలు లభించనున్నాయి. మంత్రి శ్రీధర్‌బాబుతో భేటీలో ఇన్ఫోసిస్ సీఎఫ్‌వో సంగ్రాజ్ ఈ మేరకు వెల్లడించారు.
Similar News
News February 11, 2025
సల్మాన్-అట్లీ సినిమా రద్దు?

అట్లీ డైరెక్షన్‌లో సల్మాన్ ఖాన్ నటించాల్సిన సినిమా ఆగిపోయినట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కాల్సిన ఈ మూవీలో రజినీకాంత్ లేదా కమల్ హాసన్ కూడా నటిస్తారని ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఈ కాంబోలో మూవీ రావడం లేదని ప్రచారం జరుగుతోంది. అల్లు అర్జున్‌తో చేసే సినిమా కోసం అట్లీ స్క్రిప్ట్ సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. దీనిపై ఆయన నుంచి స్పష్టత రావాల్సి ఉంది.
News February 11, 2025
2026 ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ: దీదీ

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ప.బెంగాల్ CM, TMC అధినేత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. కాంగ్రెస్, ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోబోమని స్పష్టం చేశారు. ‘ఢిల్లీలో AAPకు కాంగ్రెస్, హరియాణాలో కాంగ్రెస్‌కు AAP మద్దతివ్వలేదు. అందుకే BJP గెలిచింది. కానీ ఇక్కడ మన పార్టీ ఒక్కటే చాలు. వరుసగా నాలుగోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం’ అని పార్టీ MLAల సమావేశంలో వ్యాఖ్యానించారు.
News February 11, 2025
CTలో బుమ్రా ఆడతాడా? తేలేది నేడే!

ఈనెల 19 నుంచి జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో బుమ్రా ఆడతారా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. జట్టులో మార్పులకు ఇవాళ్టితో గడువు ముగియనున్న నేపథ్యంలో బీసీసీఐ నేడు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వెన్ను నొప్పితో బాధపడుతున్న బుమ్రా ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఆయన పరిస్థితిని మెడికల్ టీమ్ పర్యవేక్షిస్తోంది. ఒకవేళ ఆయన ఈ టోర్నీకి దూరమైతే భారత జట్టుకు పెద్ద లోటే అని చెప్పవచ్చు.