News January 3, 2025
స్కూలు విద్యార్థులకు ఇన్ఫోసిస్ స్కిల్స్
AP: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి టెక్నాలజీ రంగాల్లో అంతర్జాతీయంగా వస్తున్న మార్పులపై స్కూలు దశలోనే విద్యార్థుల్లో అవగాహన కల్పించేలా ఇన్ఫోసిస్‌తో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇన్ఫోసిస్ రూపొందించిన బస్సును మంత్రి లోకేశ్ ప్రారంభించారు. స్కూలు విద్యార్థులకు ఎలక్ట్రానిక్స్, రోబోటిక్స్, మైక్రో కంట్రోలర్, IOT, AI రంగాలపై ఇందులోని ట్రైనర్స్ బేసిక్ స్కిల్స్ అందిస్తారు.
Similar News
News January 20, 2025
శ్రీవారి భక్తులకు అలర్ట్
AP: తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు నిన్నటితో ముగిశాయి. ఇవాళ భక్తులను ఎలాంటి టోకెన్లు లేకుండా స్వామివారి దర్శనానికి క్యూలైన్లలో టీటీడీ అనుమతించనుంది. నేడు ప్రోటోకాల్ మినహా సిఫార్సు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనం, ఆఫ్‌లైన్‌లో శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల జారీ రద్దు చేసింది. తిరిగి ఈ ఏడాది డిసెంబర్‌లో వైకుంఠ ద్వారాలు తెరుచుకోనున్నాయి.
News January 20, 2025
పవిత్రతో రిలేషన్‌పై నరేశ్ ఆసక్తికర కామెంట్స్
నటి పవిత్ర వచ్చాక తన జీవితం కాస్త మెరుగుపడిందని సినీ నటుడు నరేశ్ చెప్పారు. ఇప్పుడు లైఫ్ టైటానిక్ ఒడ్డుకు చేరినట్లుగా ఉందని తనదైన శైలిలో చమత్కరించారు. అర్థం చేసుకునే మనుషులు జీవితంలో ఉంటే బాగుంటుందని ఆయన పేర్కొన్నారు. ఇక సూపర్ స్టార్ మహేశ్ బాబుతో తనకు మంచి అనుబంధం ఉందని చెప్పారు. భవిష్యత్తులోనూ ఇదే బంధం కొనసాగిస్తామన్నారు.
News January 20, 2025
ఇండియా కూటమిలో చేరాలని విజయ్‌కి ఆఫర్
విభజన శక్తులతో పోరాడేందుకు ఇండియా కూటమిలో చేరాలని తమిళగ వెట్రి కజగం చీఫ్, సినీ నటుడు విజయ్‌ని తమిళనాడు కాంగ్రెస్ చీఫ్ సెల్వపెరుంతగై కోరారు. ఇటీవల ఓ సభలో దేశంలో విభజన శక్తులు ఉన్నాయని విజయ్ అన్నారు. అలాంటి శక్తులను నిర్మూలించి, దేశానికి ప్రయోజనం చేకూర్చేందుకు తమతో చేరాలని కాంగ్రెస్ చీఫ్ సూచించారు. అయితే రాహుల్‌పై విజయ్ కొంత నమ్మకం ఉంచాలని TN బీజేపీ చీఫ్ అన్నామలై వ్యంగ్యస్త్రాలు సంధించారు.