News November 27, 2024
జగన్ ముడుపుల వ్యవహారంపై విచారించండి: షర్మిల

AP: గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను APCC చీఫ్ షర్మిల కలిశారు. అదానీ, జగన్ మధ్య ముడుపుల వివాదంపై దర్యాప్తు చేపట్టాలని గవర్నర్‌ను ఆమె కోరారు. వెంటనే దర్యాప్తు చేపట్టేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆమె గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు.
Similar News
News January 10, 2026
బడ్ చిప్ పద్ధతిలో చెరకు సాగుతో అధిక లాభం

తెలుగు రాష్ట్రాల్లో చెరకు ప్రధాన వాణిజ్య పంటగా లక్షల ఎకరాల్లో సాగవుతోంది. సాగు ఖర్చులు పెరగడం, కూలీల కొరత వల్ల క్రమంగా ఈ పంట సాగు విస్తీర్ణం తగ్గుతోంది. ఈ తరుణంలో చెరకులో సాగు ఖర్చులు తగ్గి, అధిక దిగుబడులు పొందడానికి కను చిప్పల ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేశారు. దీని సాయంతో నాణ్యమైన చెరకు నారు పెంచి, ప్రధాన పొలంలోని వరుసల్లో నాటినట్లయితే నికర ఆదాయం పెరిగి రైతులకు లాభం చేకూరుతుంది.
News January 10, 2026
చైనా, బంగ్లా ముప్పు.. బెంగాల్‌లో మన నేవీ బేస్!

చైనా, బంగ్లాదేశ్ నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఈశాన్యంలో రక్షణను ఇండియా కట్టుదిట్టం చేస్తోంది. బెంగాల్‌లోని హల్దియాలో కొత్త నేవీ బేస్‌ను ఏర్పాటు చేయనుంది. 100 మంది ఆఫీసర్లు, సెయిలర్లను నియమించడంతోపాటు ఒక జెట్టీని, ఇతర ఫెసిలిటీస్‌ను నిర్మించనుంది. ఫాస్ట్ ఇంటర్‌సెప్టార్ క్రాఫ్ట్స్, ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్స్ వంటి చిన్న వార్ షిప్స్‌ను అక్కడ మోహరించనుంది. దీంతో అక్కడ నిఘా, రక్షణ పెరగనుంది.
News January 10, 2026
రివ్యూ ఆప్షన్ నిలిపివేత.. కారణం ఇదే

సినిమా రివ్యూల పేరిట జరుగుతున్న ‘డిజిటల్ మాఫియా’కు అడ్డుకట్ట వేస్తూ టాలీవుడ్‌లో సరికొత్త అధ్యాయం మొదలైంది. కొందరు కావాలనే సినిమాలను టార్గెట్ చేస్తూ ఇచ్చే తప్పుడు రివ్యూలు, నెగటివ్ రేటింగ్స్ వల్ల నిర్మాతలు భారీగా నష్టపోతున్నారు. ఈ పరిస్థితిని అరికట్టేందుకు ‘మన శంకరవరప్రసాద్‌గారు’ చిత్ర బృందం కోర్టును ఆశ్రయించింది. న్యాయస్థానం ఆదేశాలతో బుకింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో రివ్యూ ఆప్షన్‌ను నిలిపివేశారు.


