News November 27, 2024

జగన్ ముడుపుల వ్యవహారంపై విచారించండి: షర్మిల

image

AP: గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను APCC చీఫ్ షర్మిల కలిశారు. అదానీ, జగన్ మధ్య ముడుపుల వివాదంపై దర్యాప్తు చేపట్టాలని గవర్నర్‌ను ఆమె కోరారు. వెంటనే దర్యాప్తు చేపట్టేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆమె గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు.

Similar News

News December 11, 2024

రికార్డ్ సృష్టించిన విరాట్ కోహ్లీ తనయుడు!

image

కోహ్లీ-అనుష్క దంపతులకు ఈ ఏడాది ఫిబ్రవరిలో అకాయ్ కోహ్లీ జన్మించిన సంగతి తెలిసిందే. ఆ పేరుకు అర్థమేంటంటూ నెటిజన్లు గూగుల్‌ని శోధించారు. ఈక్రమంలో 2024లో అత్యధికంగా అర్థం వెతికిన పదాల జాబితాలో అకాయ్ పేరు 2వ స్థానంలో నిలిచిందని గూగుల్ తెలిపింది. తొలిస్థానంలో ‘అన్ని కళ్లూ రఫా పైనే’ అన్న వాక్యం నిలిచింది. పుట్టిన తొలి ఏడాదే అకాయ్ రికార్డులు సృష్టిస్తున్నాడంటూ కోహ్లీ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News December 11, 2024

శ్రేయా ఘోషల్ భర్త గురించి తెలుసా?

image

మెలోడియస్ సింగర్ శ్రేయా ఘోషల్ భర్త శిలాదిత్య ముఖోపాధ్యాయ్ గురించి చాలా మందికి తెలియదు. ఆయన రూ.వేల కోట్ల విలువైన స్మార్ట్‌ఫోన్ యాప్ ‘ట్రూకాలర్’ కంపెనీకి గ్లోబల్ హెడ్‌. ముంబై యూనివర్సిటీలో బీఈ(ఎలక్ట్రానిక్స్) పూర్తి చేసిన ఆయన పలు కంపెనీల్లో పనిచేసి 2022 నుంచి ట్రూకాలర్‌లో ఉన్నత స్థాయిలో పనిచేస్తున్నారు. కాగా, 12సార్లు నేషనల్ అవార్డు పొందిన శ్రేయా నికర ఆదాయం రూ.240 కోట్లు అని సినీ వర్గాలు తెలిపాయి.

News December 11, 2024

ఆస్ట్రేలియా భారీ స్కోర్.. భారత్ టార్గెట్ ఎంతంటే?

image

భారత మహిళల జట్టుతో జరుగుతున్న మూడో వన్డేలో ఆస్ట్రేలియా వుమెన్స్ జట్టు భారీ స్కోరు సాధించింది. ఓవర్లన్నీ ఆడి 298/6 పరుగులు చేసింది. ఆ జట్టులో ఆల్‌రౌండర్ సదర్లాండ్ (110) సెంచరీతో దుమ్మురేపారు. ఆ జట్టు 78/4తో కష్టాల్లో ఉన్నప్పుడు సదర్లాండ్ క్రీజులో అడుగుపెట్టారు. ఆ తర్వాత భారత బౌలర్లను ఎడా పెడా బాదేస్తూ శతకం పూర్తి చేసుకున్నారు. భారత బౌలర్లలో అరుంధతి రెడ్డి 4, దీప్తి శర్మ ఒక వికెట్ పడగొట్టారు.