News June 29, 2024
తెలంగాణలో ఉన్న ఆస్తులపై ఆరా
తెలుగు రాష్ట్రాల విభజన జరిగి పదేళ్లు అవుతున్నా.. రెండు రాష్ట్రాల మధ్య ఉమ్మడి ఆస్తుల విభజన ఇంకా పూర్తి కాలేదు. దీంతో తెలంగాణలో ఉన్న మున్సిపల్ శాఖ ఉమ్మడి ఆస్తుల వివరాలపై AP మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఆరా తీశారు. ఏపీ హౌసింగ్ బోర్డు లెక్కల ప్రకారం రూ.5170 కోట్లు రావాల్సి ఉందని అధికారులు మంత్రికి వివరించారు. వీటిపై కోర్టుల్లో కేసులను త్వరగా పరిష్కరించాలని అధికారులను నారాయణ ఆదేశించారు.
Similar News
News October 4, 2024
నేడు తిరుమలకు సీఎం చంద్రబాబు
AP: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు నేడు తిరుమల వెళ్లనున్నారు. సాయంత్రం 6.20 గంటలకు ఆయన తిరుమల చేరుకుంటారు. స్వామివారికి ప్రభుత్వం తరఫున సీఎం దంపతులు పట్టువస్త్రాలు సమర్పిస్తారు. అనంతరం పెద్దశేష వాహన సేవలో పాల్గొంటారు. రాత్రికి తిరుమలలోనే బస చేస్తారు. రేపు టీటీడీ డైరీ, క్యాలెండర్‌ను ఆవిష్కరించి, వకుళమాత వంటశాలను ప్రారంభిస్తారు.
News October 4, 2024
పెళ్లి చేసుకున్న స్టార్ క్రికెటర్
అఫ్గానిస్థాన్ క్రికెటర్ రషీద్ ఖాన్ వివాహం చేసుకున్నారు. కాబుల్‌లో జరిగిన ఆయన పెళ్లి వేడుకకు అఫ్గాన్ క్రికెటర్లతో పాటు ఇతర ప్రముఖులు హాజరయ్యారు. తమ జట్టు వరల్డ్ కప్ గెలిచే వరకూ తాను మ్యారేజ్ చేసుకోనని రషీద్ చెప్పినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. దీనిని ఆయన గతంలోనే ఖండించారు. ఇప్పటివరకు AFG తరఫున అన్ని ఫార్మాట్లలో కలిపి 203 మ్యాచులు ఆడిన ఈ ఆల్‌రౌండర్ మొత్తం 376 వికెట్లు, 6706 రన్స్ సాధించారు.
News October 4, 2024
ట్రాక్టర్‌ను ఢీకొన్న ట్రక్.. 10 మంది కూలీల దుర్మరణం
ఉత్తర్‌ప్రదేశ్‌లో ఈ తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. మీర్జాపూర్‌లో వేగంగా వెళ్తున్న ట్రక్కు కూలీలను తీసుకెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీని బలంగా ఢీకొంది. దీంతో 10 మంది అక్కడికక్కడే చనిపోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వారణాసి ఆస్పత్రికి తీసుకెళ్లారు. ట్రక్కు ఢీకొన్న తీవ్రతకు ట్రాక్టర్ పక్కకు ఒరిగింది. ట్రాలీ విడిపోయి పక్కనున్న డ్రైనేజీలో బోల్తాపడింది. మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది.