News December 18, 2024

INS నిర్దేశక్‌ జాతికి అంకితం

image

సర్వే నౌక ఐఎన్ఎస్ నిర్దేశక్‌ను కేంద్ర మంత్రి సంజయ్ సేథ్ జాతికి అంకితం చేశారు. ఇవాళ విశాఖపట్నం నేవల్ డాక్ యార్డులో ఇది జలప్రవేశం చేసింది. దీనిని హైడ్రోగ్రఫీ సర్వేలు, నేవిగేషన్ అవసరాల కోసం రూపొందించారు. అత్యాధునిక హైడ్రో, ఓషనోగ్రాఫిక్ పరికరాలతో దీనిని నిర్మించారు. ఇది 18 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణించగలదు. 110 మీటర్ల పొడవు ఉండే ఈ నౌక రెండు డీజిల్ ఇంజిన్ల సహకారంతో నడుస్తుంది.

Similar News

News October 15, 2025

జనవరి నాటికి కోటి మందికి భూధార్ కార్డులు

image

TG: భూధార్‌ కార్డులను త్వరలోనే అందించనున్నారు. జనవరి నాటికి కోటి మంది రైతులకు భూధార్ అందించేలా రాష్ట్ర రెవెన్యూశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ప్రతి కమతానికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఇచ్చేలా కేంద్రం భూధార్ తీసుకొచ్చింది. సర్వే రికార్డు, RORలోని వివరాలు, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా తాత్కాలిక భూధార్‌ కార్డులు ఇచ్చి, రీ సర్వే చేశాక శాశ్వత కార్డులు ఇస్తామని భూభారతి చట్టంలో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.

News October 15, 2025

ఢిల్లీలో గ్రీన్ క్రాకర్స్ విక్రయానికి SC గ్రీన్ సిగ్నల్

image

ఢిల్లీలో దీపావళి సందర్భంగా గ్రీన్ క్రాకర్స్ విక్రయం, వినియోగానికి సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. QR కోడ్ ఉన్న గ్రీన్ క్రాకర్స్‌ను ఈనెల 18 నుంచి 21 వరకు కాల్చుకోవచ్చని తెలిపింది. దేశ రాజధానిలో పొల్యూషన్ తీవ్ర స్థాయికి చేరడంతో క్రాకర్స్ విక్రయంపై గతంలో SC నిషేధం విధించింది. పిల్లలు ఎంతో సంబరంగా చేసుకునే దీపావళికి టపాసులు కాల్చుకోవడానికి అనుమతి ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్లపై SC సానుకూలంగా స్పందించింది.

News October 15, 2025

ICAR-IARIలో 18 ఉద్యోగాలు..

image

ICAR-IARI(ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్) 18 కాంట్రాక్ట్ పోస్టులను భర్తీ చేయనుంది. వీటిలో యంగ్ ప్రొఫెషనల్(15), సీనియర్ రీసెర్చ్ ఫెలో(3) ఖాళీలు ఉన్నాయి. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఆసక్తిగల అభ్యర్థులు ఈనెల 31లోగా అప్లై చేసుకోవాలి. నవంబర్ 6, 7 తేదీల్లో ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://iari.res.in/