News April 25, 2024
అసెంబ్లీకి రాకుండా టీవీ9 ఆఫీసుకు వెళ్లాడు: CM

TG: కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా పారిపోతున్నారని సీఎం రేవంత్ విమర్శించారు. ‘అసెంబ్లీకి రాని దద్దమ్మలు.. బడికి రాని బడి దొంగల్లాంటోళ్లు. మరి అలాంటి బడి దొంగ నిన్న టీవీ9 ఆఫీసులో 4 గంటలు కూర్చున్నాడు. అసెంబ్లీలో మా కళ్లల్లోకి చూసే ధైర్యం లేక, ప్రభుత్వానికి సలహాలు ఇవ్వకుండా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు’ అని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.
Similar News
News November 7, 2025
విడుదలకు సిద్ధమవుతున్న వరి రకాలు

☛ M.T.U.1282: దీని పంటకాలం 120-125 రోజులు. మధ్యస్త సన్నగింజ రకం. చేనుపై పడిపోదు, అగ్గి తెగులును తట్టుకుంటుంది. గింజ రాలిక తక్కువ. దిగుబడి ఎకరాకు 2.8-3టన్నులు.
☛ M.T.U.1290: పంటకాలం 117-120 రోజులు. సన్నగింజ రకం. చేనుపై పడిపోదు. అగ్గి తెగులును కొంత వరకు తట్టుకుంటుంది. చౌడునేలలకు అత్యంత అనుకూలం. సాధారణ భూమిలో ఎకరాకు 3 టన్నులు, చౌడు నేలల్లో ఎకరాకు 2-2.5 టన్నుల దిగుబడి వస్తుంది. ఎగుమతులకు అనుకూలం.
News November 7, 2025
అమరావతి సిగలో మైక్రోసాఫ్ట్ క్వాంటమ్ కంప్యూటర్

ప్రముఖ టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్ అమరావతిలో భారీ క్వాంటమ్ కంప్యూటర్(1,200 క్యూబిట్ సామర్థ్యం)ను ఏర్పాటు చేయనుంది. రూ.1,772 కోట్ల పెట్టుబడికి సంస్థ సిద్ధమవుతోంది. ఇందుకోసం 4వేల చ.అ. విస్తీర్ణంలో భవనం అవసరముంటుంది. ఈ మేరకు సంస్థ ప్రతినిధులతో అధికారుల చర్చలు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే IBM 133 క్యూబిట్, జపాన్కు చెందిన ఫుజిసు 64 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటుకు ముందుకొచ్చాయి.
News November 7, 2025
రాజమౌళి చిత్రం నుంచి బిగ్ అప్డేట్

రాజమౌళి-మహేశ్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతోన్న మూవీ(SSMB29) నుంచి బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ లుక్ను జక్కన్న సోషల్ మీడియాలో విడుదల చేశారు. ‘‘పృథ్వీతో మొదటి షాట్ పూర్తవగానే అతని దగ్గరికి వెళ్లి నాకు తెలిసిన అత్యుత్తమ నటుల్లో మీరు ఒకరు అని చెప్పాను. శక్తిమంతమైన, క్రూరమైన విరోధి ‘కుంభ’(పృథ్వీ క్యారెక్టర్ పేరు)కు ప్రాణం పోయడం సంతృప్తికరం’’ అని రాసుకొచ్చారు.


