News April 25, 2024

అసెంబ్లీకి రాకుండా టీవీ9 ఆఫీసుకు వెళ్లాడు: CM

image

TG: కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా పారిపోతున్నారని సీఎం రేవంత్ విమర్శించారు. ‘అసెంబ్లీకి రాని దద్దమ్మలు.. బడికి రాని బడి దొంగల్లాంటోళ్లు. మరి అలాంటి బడి దొంగ నిన్న టీవీ9 ఆఫీసులో 4 గంటలు కూర్చున్నాడు. అసెంబ్లీలో మా కళ్లల్లోకి చూసే ధైర్యం లేక, ప్రభుత్వానికి సలహాలు ఇవ్వకుండా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు’ అని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.

Similar News

News December 11, 2025

రాష్ట్రంలో 182 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

image

<>ఏపీ <<>>మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖ 26 జిల్లాల్లోని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, జువైనల్ జస్టిస్ బోర్డులో ఖాళీగా ఉన్న 182 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉద్యోగాన్ని బట్టి డిగ్రీ, చైల్డ్ సైకాలజీ, సైకియాట్రీ, సోషియాలజీ, హెల్త్ సైన్స్, ఎడ్యుకేషన్, LLB ఉత్తీర్ణతతో పాటు సంక్షేమ కార్యక్రమాల్లో పని అనుభవం గల వారు DEC 22 వరకు అప్లై చేసుకోవచ్చు. వెబ్‌సైట్: https://wdcw.ap.gov.in/

News December 11, 2025

ఆలయ ప్రవేశం.. ఆరోగ్య కారకం!

image

గుడికి వెళ్లినప్పుడు చెప్పులను బయటే వదిలేస్తాం. దీనివల్ల ప్రతికూల శక్తి ఆలయంలోకి ప్రవేశించదు. దేవాలయ ప్రాంగణంలో ఒట్టి కాళ్లతో నడవడం వల్ల నేలలోని పాజిటివ్ ఎనర్జీ పాదాల ద్వారా శరీరమంతా వ్యాపించి, ఆరోగ్యాన్ని పెంచుతుంది. అలాగే దేవతా విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేస్తారు కాబట్టి అందులో కూడా శక్తిమంతమైన అయస్కాంత శక్తి నిలుస్తుంది. దైవ దర్శనంతో ఆ శక్తి మనలోకి ప్రవేశించి, నెగటివ్ ఎనర్జీని తొలగిస్తుంది.

News December 11, 2025

నేటి నుంచి బీజేపీ బస్సు యాత్ర

image

AP: మాజీ ప్రధాని, దివంగత వాజ్‌పేయీ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా బీజేపీ ఇవాళ్టి నుంచి ‘అటల్-మోదీ సుపరిపాలన’ బస్సు యాత్ర చేయనుంది. రాయలసీమలోని ధర్మవరం నుంచి యాత్ర ప్రారంభం కానుంది. మోదీ ప్రభుత్వం చేస్తోన్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను నాయకులు ప్రజలకు వివరించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటన అనంతరం ఈ నెల 25న అమరావతిలో జరిగే ముగింపు సభలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ పాల్గొననున్నారు.