News August 16, 2024
ఇన్సూరెన్స్: ‘ఫ్రీ లుక్ పీరియడ్’ గురించి తెలుసా?
ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాక 30రోజుల వరకూ ఫ్రీ లుక్ పీరియడ్ ఉంటుంది. ఆ సమయంలో పాలసీని మరింత అర్థం చేసుకోవచ్చు. నచ్చకపోతే రద్దు చేసుకోవచ్చు. పాలసీలో ఏదైనా మోసపూరితంగా ఉన్నట్లు మీరు గుర్తిస్తే కంపెనీకి తెలియజేయాలి. కొన్ని సంస్థలు పాలసీ రద్దు చేసేందుకు వెబ్‌సైట్లోనే అవకాశం కల్పిస్తున్నాయి. కాగా కొన్ని సందర్భాల్లో 30రోజుల తర్వాతా ఈ రద్దు ఛాన్స్ ఉంటుంది. కాకపోతే కొన్ని రకాల ఛార్జెస్ ఉంటాయి.
Similar News
News September 14, 2024
జెత్వానీ కేసులో ఇద్దరు పోలీసులపై వేటు
AP: నటి కాదంబరి జెత్వానీ కేసులో ఇద్దరు పోలీసులపై DGP ద్వారకా తిరుమలరావు వేటు వేశారు. అప్పట్లో ఈ కేసును డీల్ చేసిన ACP కె.హనుమంతరావు, CI ఎం.సత్యనారాయణను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసులో మరో ఇద్దరు CIలు, ఒక SI పాత్ర ఉందని అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. వారిపైనా చర్యలు తీసుకుంటారని సమాచారం. కాగా నిన్న ఆంజనేయులు, కాంతిరాణా, విశాల్ గున్నీపై జెత్వానీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
News September 14, 2024
1, 2 అంతస్తుల్లో ఉన్నవారికీ వరద సాయం
AP: రాష్ట్రంలో వరదలతో తీవ్రంగా నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 17న వరద ముంపు బాధితులకు పరిహారం ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. గ్రౌండ్ ఫ్లోర్‌తోపాటు ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్నవారికి కూడా సాయం అందించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆపైన ఉన్న అంతస్తుల వారికీ కొంత సాయం చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. అన్నిటినీ పరిగణనలోకి తీసుకుని పరిహారం చెల్లించనున్నారు.
News September 14, 2024
పటిష్ఠంగానే ‘రాజధాని’ పునాదులు?
AP: ఐదేళ్లుగా నీటిలో నానుతున్న రాజధాని అమరావతిలోని భవనాల పునాదులు పటిష్ఠంగానే ఉన్నాయని చెన్నై, HYD IIT నిపుణులు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీనిపై రెండు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నట్లు సమాచారం. తుప్పు పట్టిన ఇనుము తొలగించి, కెమికల్ ట్రీట్‌మెంట్ చేసి నిర్మాణాలు కొనసాగించవచ్చనే నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. కాగా నిపుణులు ఇటీవల రాజధాని నిర్మాణాలను పరిశీలించిన విషయం తెలిసిందే.