News October 8, 2024
తిరుమలలో ఇంటిగ్రేటెడ్ ఫుడ్ ల్యాబ్: సత్యకుమార్

AP: రాష్ట్రంలోని 22 జిల్లాల్లో ఫుడ్ టెస్టింగ్ ల్యాబులు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఈ మేరకు ఇవాళ ఢిల్లీలో FSSAIతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఆహార భద్రతా ప్రమాణాలు బలోపేతం చేసేందుకే రూ.88 కోట్ల ఎంఓయూ కుదుర్చుకున్నట్లు మంత్రి పేర్కొన్నారు. మరోవైపు రూ.20 కోట్ల వ్యయంతో తిరుమల, కర్నూలులో ఇంటిగ్రేటెడ్ ఫుడ్ ల్యాబ్‌లు కూడా నెలకొల్పుతామని చెప్పారు.
Similar News
News November 4, 2025
నేపాల్‌లో ఏమైందో తెలుసు కదా?.. పోర్న్ బ్యాన్ పిల్‌పై సుప్రీంకోర్టు

దేశంలో పోర్నోగ్రఫీని నిషేధించాలని కోరుతూ దాఖలైన పిల్‌ను తక్షణమే విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ సందర్భంగా నేపాల్‌లో జరిగిన Gen Z నిరసనలను ప్రస్తావించింది. ‘సోషల్ మీడియాను నిషేధించడం వల్ల నేపాల్‌లో ఏం జరిగిందో చూశారు కదా?’ అని CJI బీఆర్ గవాయ్ నేతృత్వంలోని బెంచ్ వ్యాఖ్యానించింది. 4 వారాల తర్వాత విచారిస్తామని స్పష్టంచేసింది. అయితే నవంబర్ 23నే జస్టిస్ గవాయ్ రిటైర్ కానుండటం గమనార్హం.
News November 4, 2025
రాత్రంతా ఆలోచిస్తూ, ఒంటరిగా ఉంటూ.. మృత్యుంజయుడి ఆక్రందన!

అహ్మదాబాద్ విమాన ప్రమాదం నుంచి బయటపడిన <<16688689>>మృత్యుంజయుడు<<>> రమేశ్ మానసికంగా కుంగిపోతున్నాడు. ‘ప్రమాదంలో తమ్ముడిని కోల్పోయా. ఆ ఘటన పదే పదే గుర్తొస్తోంది. రాత్రంతా ఆలోచిస్తూ, మేలుకొనే ఉంటున్నా. ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతున్నా. నా భార్యతో, కొడుకుతోనూ మాట్లాడటం లేదు. మానసికంగా బాధపడుతున్నా. 4 నెలలుగా అమ్మ మాట్లాడట్లేదు’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.
News November 4, 2025
డిస్కంలకు రూ.2,635 కోట్లు విడుదల

AP: డిస్కంలకు చెల్లించాల్సిన టారిఫ్ సబ్సిడీ నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. 2025-26 మూడో త్రైమాసికానికి సంబంధించి రూ.2,635 కోట్లను రిలీజ్ చేసింది. హడ్కో నుంచి రూ.5వేల కోట్ల రుణం పొందేందుకు ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు హామీ ఇచ్చింది. విద్యుత్, బొగ్గు కొనుగోళ్లు, నిర్వహణ అవసరాలకు వెచ్చించాలని ఆదేశించింది.


