News May 26, 2024

ఇంటర్ మార్కుల్లో తప్పిదాలు.. రీవెరిఫికేషన్ కోసం బోర్డు యత్నం?

image

TG: ఇంటర్ మూల్యాంకనంలో నిర్లక్ష్యంతో <<13310748>>నష్టపోయిన<<>> విద్యార్థుల జవాబు పత్రాలు రీవెరిఫికేషన్ చేసేందుకు ఇంటర్ బోర్డు ప్రభుత్వాన్ని అనుమతి కోరనుంది. గతంలో ఇలానే విద్యార్థులకు న్యాయం చేశారని పలువురు గుర్తుచేస్తున్నారు. ఈ సారీ చాలామంది విద్యార్థుల మార్కుల్లో తప్పిదాలు జరగడంతో ప్రభుత్వ అనుమతి కోసం బోర్డు యత్నిస్తోంది. ఇంటర్ కార్యదర్శి శ్రుతి రేపు విధులకు హాజరైన అనంతరం దీనిపై స్పష్టత రానుంది.

Similar News

News April 16, 2026

ORR అలైన్‌మెంట్‌పై జోక్యం చేసుకోలేం: హైకోర్టు

image

AP: అమరావతి ORR నిర్మాణానికి సంబంధించి విజయవాడ ఆగ్నేయ, ఈశాన్య పరిధిలోని అలైన్‌మెంట్‌ను సవాల్ చేస్తూ దాఖలైన PILపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల విషయంలో కోర్టులు జోక్యం చేసుకోలేవని స్పష్టం చేసింది. ORR నిర్మాణం ఎక్కడ జరగాలో పిటిషనర్ ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నించింది. నిపుణుల బృందం ఖరారు చేసిన అలైన్‌మెంట్లలో తాము జోక్యం చేసుకోబోమని తేల్చిచెప్పింది.

News April 16, 2026

బాహ్యరూపం చూసి అంచనా వేయొద్దు!

image

మిరెము గింజ చూడ మీద నల్లగనుండు
కొరికి చూడ లోనంజురు మనును
సజ్జనులగువారి సార మిట్లుండురా
విశ్వదాభిరామ! వినుర వేమ!!
తాత్పర్యం: మిరియపు గింజ పైకి నల్లగా, అందవిహీనంగా ఉన్నప్పటికీ కొరికినప్పుడు దాని పనితనం తెలుస్తుంది. అలాగే సజ్జనులు పైకి సామాన్యంగా కనిపించినా వారి లోపల అపారమైన జ్ఞానం, మంచి గుణాలు ఉంటాయి.
<<-se>>#PADHYAM<<>>

News April 16, 2026

ప్రపంచంలోనే అతిపొడవైన ముక్కు ఈయనదే!

image

18వ శతాబ్దానికి చెందిన బ్రిటిష్ సర్కస్ కళాకారుడు థామస్ వాడ్‌హౌస్ ప్రపంచంలోనే అత్యంత పొడవైన ముక్కును కలిగి ఉండేవారు. ఆయన ముక్కు 19cms(7.5inch) పొడవు ఉండేది. గిన్నిస్ రికార్డ్స్ ప్రకారం మానవ చరిత్రలోనే ఇదే అత్యధికం. ఈ అరుదైన రూపాన్ని గౌరవిస్తూ ‘రిప్లీస్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్’ మ్యూజియంలో ఆయన మైనపు విగ్రహాన్ని నేటికీ ప్రదర్శిస్తున్నారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో-వంద వింతలు’లో(47/100)