News February 22, 2025
ఏప్రిల్ 1 నుంచే ఇంటర్ క్లాసులు.. సెలవులు కుదింపు

AP: ఇంటర్ విద్యలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వచ్చే విద్యాసంవత్సరంలో CBSE తరహాలో APR 1 నుంచే సెకండియర్ తరగతులు ప్రారంభించాలని విద్యాశాఖ నిర్ణయించింది. అకడమిక్‌తో పోటీ పరీక్షలకు సంబంధించి 22వ తేదీ వరకు క్లాసులు నిర్వహించనుంది. APR 23 నుంచి జూన్ 1 వరకు సెలవులు ఇవ్వనుంది. గతంలో పరీక్షల పూర్తయిన వెంటనే సెలవులు ఇస్తుండగా ఇకపై వాటిని కుదించనుంది.
Similar News
News March 16, 2025
‘పుష్ప-3’ రిలీజ్ అయ్యేది అప్పుడే: నిర్మాత

‘పుష్ప-3’ సినిమాను 2028లో రిలీజ్ చేస్తామని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్ వెల్లడించారు. విజయవాడలో జరిగిన ‘రాబిన్ హుడ్’ ప్రెస్‌మీట్‌లో ఆయన పాల్గొన్నారు. అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ డైరెక్షన్‌లో సినిమా చేస్తున్నారని తెలిపారు. సుకుమార్ దర్శకత్వంలో 2021లో వచ్చిన పుష్ప, 2024లో రిలీజైన ‘పుష్ప-2’ సూపర్ హిట్‌లుగా నిలవగా, ‘పుష్ప-2’ రూ.1800 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన సంగతి తెలిసిందే.
News March 16, 2025
భూమిపైకి సునీతా విలియమ్స్.. ఎప్పుడంటే

వారం రోజుల మిషన్‌పై వెళ్లి 9 నెలల పాటు అంతరిక్షంలో చిక్కుకుపోయిన సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్ భూమిపై అడుగు పెట్టే సమయం ఆసన్నమైంది. వాతావరణం అనుకూలిస్తే ఈ నెల 19న భూమికి తిరిగి రానున్నారు. వీరు ప్రయాణించే డ్రాగన్ క్యాప్సూల్ అమెరికాలోని ఫ్లోరిడా తీరంలో ల్యాండ్ కానుంది. దీంతో వ్యోమగాములిద్దరూ క్షేమంగా తిరిగిరావాలని ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది కోరుకుంటున్నారు.
News March 16, 2025
FRO స్క్రీనింగ్ టెస్ట్.. 70.85% హాజరు

AP: రాష్ట్ర అటవీశాఖలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి ఇవాళ నిర్వహించిన స్క్రీనింగ్ టెస్ట్ ప్రశాంతంగా ముగిసిందని APPSC ప్రకటించింది. 70.85% హాజరు నమోదైందని వెల్లడించింది. ఈ పరీక్ష కోసం 15,308 మంది దరఖాస్తు చేసుకోగా, 10,755 మంది హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారని తెలిపింది. 7,620 మంది పరీక్షకు హాజరైనట్లు పేర్కొంది.