News April 9, 2024
ఈనెల 25 తేదీలోగా ఇంటర్ ఫలితాలు?

TG: ఇంటర్ పరీక్షల ఫలితాలు ఈనెల 25వ తేదీలోగా విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటికే జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తికాగా, టెక్నికల్ అంశాలను ఇంటర్ బోర్డు పరిశీలిస్తోంది. మార్కులను ఆన్లైన్లో నమోదు చేయడం, OMR షీట్ కోడ్ డీ కోడ్ చేయడం వంటి పనులకు ఇంకొన్ని రోజులు టైమ్ పట్టనుంది. ఈ ప్రక్రియను 21వ తేదీ నాటికి పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. 2, 3 రోజుల్లో ఫలితాల ప్రకటన తేదీని ఖరారు చేస్తారని సమాచారం.
Similar News
News January 1, 2026
బాల భీముడు పుట్టాడు.. అదీ నార్మల్ డెలివరీ..

AP: అనకాపల్లి ప్రభుత్వాస్పత్రిలో ఓ మహిళ ఏకంగా 4.8 కేజీల బరువున్న శిశువుకు జన్మనిచ్చింది. అది కూడా నార్మల్ డెలివరీ కావడం విశేషం. పెందుర్తికి చెందిన మహిళకు సాధారణ ప్రసవంలో శిశువు తల మామూలుగానే బయటకు వచ్చినా భుజాలు రాకపోవడంతో సిజేరియన్ తప్పదేమోనని భావించారు. కానీ వైద్యులు 4 గంటల పాటు శ్రమించి సాధారణ కాన్పు చేశారు. తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు. డాక్టర్లను మంత్రి సత్యకుమార్ అభినందించారు.
News January 1, 2026
రాగి ఆభరణాలతో చర్మ సంరక్షణ

రాగి ఆభరణాలను ధరించడం వల్ల వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి. కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడంలో రాగి ఆభరణాలు మనకు ఎంతో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. రాగి ఆభరణాలను ధరించడం వల్ల చర్మం మృదువుగా తయారవుతుంది. చర్మంపై ముడతలు, మచ్చలు తగ్గుతాయి. చర్మం రంగు కూడా మెరుగుపడుతుంది. చర్మం కాంతివంతంగా మారి మెరుస్తుంది. యవ్వనంగా ఉంటారు. అలాగే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
News January 1, 2026
కొత్త సంవత్సరం.. ఇంటికి ఇవి తెచ్చుకుందామా?

కొత్త ఏడాదిలో అదృష్టం కోసం ఇంటికి శ్రీయంత్రం, వెండి నాణెం తేవాలని వాస్తు, జ్యోతిష నిపుణులు సూచిస్తున్నారు. మనీ ప్లాంట్, తులసి మొక్కలు నాటాలని చెబుతున్నారు. ‘తాబేలు ప్రతిమ, దక్షిణామూర్తి చిత్రపటాన్ని పూజ గదిలో అమర్చాలి. కుబేర యంత్రం, గోమతి చక్రాలు కొనుగోలు చేసిన ఇల్లు సుఖశాంతులతో వర్ధిల్లుతుంది’ అంటున్నారు. కొత్త ఏడాదిలో లక్ష్మీ కటాక్షం కోసం ఏం చేయాలో తెలుసుకోవడానికి <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.


