News April 9, 2024
ఈనెల 25 తేదీలోగా ఇంటర్ ఫలితాలు?
TG: ఇంటర్ పరీక్షల ఫలితాలు ఈనెల 25వ తేదీలోగా విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటికే జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తికాగా, టెక్నికల్ అంశాలను ఇంటర్ బోర్డు పరిశీలిస్తోంది. మార్కులను ఆన్‌లైన్‌లో నమోదు చేయడం, OMR షీట్ కోడ్ డీ కోడ్ చేయడం వంటి పనులకు ఇంకొన్ని రోజులు టైమ్ పట్టనుంది. ఈ ప్రక్రియను 21వ తేదీ నాటికి పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. 2, 3 రోజుల్లో ఫలితాల ప్రకటన తేదీని ఖరారు చేస్తారని సమాచారం.
Similar News
News November 8, 2024
అరెస్టులను ఖండిస్తున్నాం: KTR
సీఎం రేవంత్ మూసీ పాదయాత్ర నేపథ్యంలో పోలీసులు BRS నేతలను అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నట్లు కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘ప్రజా పాలన అంటూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రి, మంత్రులు పర్యటనలు చేసిన ప్రతిసారి మా పార్టీ నేతలను ముందస్తు అరెస్టులు, హౌస్ అరెస్టులు చేస్తోంది. ఎన్ని నిర్బంధాలకు గురిచేసినా ప్రజల తరఫున ప్రశ్నిస్తూనే ఉంటాం. మా నేతలను వెంటనే విడుదల చేయాలి’ అని పేర్కొన్నారు.
News November 8, 2024
ట్రూడో ఓడిపోవడం ఖాయం: ఎలాన్ మస్క్
ఇండియాతో తగువులతో వార్తల్లో నిలుస్తున్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోపై బిలియనీర్ ఎలాన్ మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఆయన ఓడిపోవడం ఖాయమని అంచనా వేశారు. జర్మనీలో సోషలిస్ట్ ప్రభుత్వం <<14553363>>కూలిపోతోందని<<>> ఒకరు, ఇలాగే కెనడాలోనూ ట్రూడోను తొలగించడానికి మీ సాయం కావాలని మరొకరు ట్వీట్ చేయగా మస్క్ స్పందించారు. కాగా కెనడాలో 2025 అక్టోబర్ 20న ఎన్నికలు జరగనున్నాయి.
News November 8, 2024
ప్రపంచం మారినా బాబు మారడు: విజయసాయిరెడ్డి
AP: ప్రపంచం ఎంతో మారిందని, కానీ సీఎం చంద్రబాబు మారడం లేదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. పుట్టినప్పటి నుంచి అవే మోసాలు, అబద్ధాలు ఆడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. ‘జ్ఞానం కలగాల్సిన వయసులో కూడా పాపాలు చేస్తున్నాడు. ఆయనకు ఇక నరకం సరిపోదు.. యముడు ఒక ప్రత్యేక లోకాన్ని సృష్టించాల్సిందే. చివరకు ఆ యముడిని కూడా తప్పుదోవ పట్టిస్తారేమో?’ అని ఆయన ట్వీట్ చేశారు.