News April 4, 2024
12న ఇంటర్ ఫలితాలు!

AP: ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలను ఈ నెల 12వ తేదీ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నేటితో జవాబు పత్రాల మూల్యాంకనం ముగియనుంది. ఆపై వెంటనే పున:పరిశీలన, మార్కుల నమోదు పూర్తి చేసి ఫలితాలను విడుదల చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఇటు పదో తరగతి మూల్యాంకనం ఈ నెల 8తో పూర్తి కానుంది. ఆ తర్వాత వారం, పది రోజుల్లో పది ఫలితాలను సైతం విడుదల చేసే అవకాశముంది.
Similar News
News April 6, 2026
రేపే చంద్రుడి సమీపానికి వ్యోమగాములు.. ఫొటోల కోసం వెయిటింగ్!

‘ఆర్టెమిస్-2’ మిషన్ కీలక దశకు చేరుకుంది. రేపు జరగనున్న ‘లూనార్ ఫ్లైబై’ కోసం వ్యోమగాములు సర్వం సిద్ధం చేసుకున్నారని NASA పేర్కొంది. ఇప్పటివరకూ భూమి అద్భుత దృశ్యాలను పంపిన బృందం.. రేపు చంద్రుడిని అత్యంత సమీపం నుంచి ఫొటోలు తీయనుంది. ఈ చరిత్రాత్మక ఘట్టం కోసం ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. చందమామ అందాలను దగ్గరగా చూసే సమయం ఆసన్నమైంది. *ఇప్పటివరకూ NASA షేర్ చేసిన ఫొటోలివే..
News April 6, 2026
ఫ్యామిలీతో రష్మిక బర్త్ డే.. ఫొటోలు చూశారా?

నేషనల్ క్రష్ రష్మిక తన పుట్టినరోజును కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకున్నారు. పెళ్లి తర్వాత వచ్చిన తొలి బర్త్ డే కావడంతో భర్త విజయ్ దేవరకొండతో కలిసి ప్రత్యేకంగా ప్లాన్ చేశారు. ఇరు కుటుంబ సభ్యులు ఒకచోట చేరి ఈ వేడుకను ఎంజాయ్ చేశారు. సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతున్న ఈ కొత్త జంట ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఫ్యామిలీతో ఎంతో సింపుల్‌గా ఉన్న ఈ స్టార్ కపుల్‌ని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
News April 6, 2026
గ్యాస్ సిలిండర్ దొరకట్లేదా? ఇది ఈజీగా పొందొచ్చు

నగరాలు, పట్టణాల్లోని వలస కార్మికులు, విద్యార్థుల కోసం 5 కేజీల FTL సిలిండర్ల పంపిణీని కేంద్రం వేగవంతం చేసింది. అడ్రస్ ప్రూఫ్ లేకపోయినా వీటిని పొందవచ్చని విస్తృత ప్రచారం చేస్తోంది. ఆథరైజ్డ్ గ్యాస్ డీలర్ వద్దకు వెళ్లి ఏదైనా ఒక వ్యాలిడ్ ఐడీ కార్డు చూపిస్తే చాలని తెలిపింది. మార్చి 23 నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 6.6 లక్షల సిలిండర్లను డెలివరీ చేసినట్లు వివరించింది.


