News April 12, 2024
కాసేపట్లో ఇంటర్ ఫలితాలు.. Way2Newsలో వేగంగా..

AP ఇంటర్ ఫలితాలు ఉ.11 గంటలకు విడుదల కానున్నాయి. BIEAP అధికారిక సైట్‌తో పాటు Way2News యాప్‌లోనూ ఫలితాలు పొందవచ్చు. మిగతా ప్లాట్‌ఫాంల తరహాలో విసిగించే యాడ్స్, లోడింగ్ సమస్యలు మన యాప్‌లో ఉండవు. ప్రత్యేక స్క్రీన్‌లో హాల్ టికెట్ నంబర్ ఇచ్చి క్లిక్ చేస్తే మెరుపు వేగంతో ఫలితాలు వస్తాయి. ఆ తర్వాత ఒకే క్లిక్‌తో వాట్సాప్ సహా ఏ ప్లాట్‌ఫాంకైనా రిజల్ట్ కార్డ్ షేర్ చేసుకోవచ్చు. #ResultsFirstOnWay2News
Similar News
News March 26, 2026
గొర్రెల్లో బొబ్బ రోగం(అమ్మతల్లి)-లక్షణాలు

ఏడాదిలో ఏ కాలంలోనైనా, ఏ ప్రాంతాల్లో గొర్రెలకైనా సోకే అంటువ్యాధి. ఇది సోకిన గొర్రెలు ఆకస్మికంగా నీరసంగా మారతాయి. శరీర ఉష్ణోగ్రత పెరిగి కళ్లు ఎర్రబడి నీరు కారతాయి. వ్యాధి సోకిన 1,2 రోజుల్లో గొర్రె శరీర భాగాలపై దద్దుర్లు ఏర్పడి క్రమేణా పెద్దవై, బొబ్బలుగా మారి చీము పట్టి నలుపు రంగులోకి మారతాయి. వ్యాధి తీవ్రత బట్టి సుమారు 20-30% గొర్రెలు మరణిస్తాయి. ఈ లక్షణాలను గుర్తించిన వెంటనే చికిత్స అందించాలి.
News March 26, 2026
వివాదాస్పద పాట.. అర్థం తెలియదన్న డైరెక్టర్

పాన్ ఇండియా సినిమా ‘KD: ది డెవిల్’లోని <<19406830>>వివాదాస్పద<<>> పాటపై డైరెక్టర్ ప్రేమ్ స్పందించారు. హిందీపై తనకు పట్టులేదని, ఆ పాట లిరిక్స్ అర్థం తెలియదని చెప్పారు. ఇదొక ఎమోషనల్ మూవీ అని, కేవలం ఫన్ కోసమే ఆ పాటను పెట్టామన్నారు. ఇదే సాంగ్‌కు కేరళం, కర్ణాటకలో ప్రశంసలు వస్తున్నాయని తెలిపారు. పశ్చిమాసియాలో యుద్ధం, గ్యాస్ కొరత లాంటి ముఖ్యమైన విషయాలపై చర్చించాలి గానీ ఇలాంటి వాటిపై కాదని పేర్కొన్నారు.
News March 26, 2026
67,583 ఉద్యోగాలు భర్తీ చేశాం: డిప్యూటీ సీఎం భట్టి

TG: రాష్ట్రంలో ఇప్పటివరకు 67,583 ఉద్యోగాలు భర్తీ చేసినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. వివిధ ప్రభుత్వ శాఖల్లోని 31,798 పోస్టులకు నియామకాలు చేపట్టినట్లు తెలిపారు. తమ హయాంలో 16,798 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి నియామకాలు చేపట్టామని.. ఇక గత ప్రభుత్వ హయాంలో నోటిఫై అయ్యి పెండింగ్ ఉన్న 50,785 పోస్టింగ్స్ కూడా పూర్తి చేశామన్నారు. నిన్న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈ వివరాలు వెల్లడించారు.


