News April 12, 2024

కాసేపట్లో ఇంటర్ ఫలితాలు.. Way2Newsలో వేగంగా..

image

AP ఇంటర్ ఫలితాలు ఉ.11 గంటలకు విడుదల కానున్నాయి. BIEAP అధికారిక సైట్‌తో పాటు Way2News యాప్‌లోనూ ఫలితాలు పొందవచ్చు. మిగతా ప్లాట్‌ఫాంల తరహాలో విసిగించే యాడ్స్, లోడింగ్ సమస్యలు మన యాప్‌లో ఉండవు. ప్రత్యేక స్క్రీన్‌లో హాల్ టికెట్ నంబర్ ఇచ్చి క్లిక్‌ చేస్తే మెరుపు వేగంతో ఫలితాలు వస్తాయి. ఆ తర్వాత ఒకే క్లిక్‌తో వాట్సాప్ సహా ఏ ప్లాట్‌ఫాంకైనా రిజల్ట్ కార్డ్ షేర్ చేసుకోవచ్చు. #ResultsFirstOnWay2News

Similar News

News March 23, 2025

కత్తెర పట్టుకుంటే రూ.లక్ష ఫీజు తీసుకుంటాడు!

image

హెయిర్ కట్‌కు సెలూన్ షాప్‌లో ఎంత తీసుకుంటారు? మధ్యతరగతి మనుషులు వెళ్లే సెలూన్లలో రూ.200 లోపే ఉంటుంది. ఎంత లగ్జరీ సెలూన్ అయినా రూ.500-1000 మధ్యలో ఉంటుంది. కానీ ఆలీమ్ హకీమ్ అనే బార్బర్ మాత్రం హెయిర్ కట్ చేస్తే మినిమం రూ.లక్ష తీసుకుంటాడు. మహేశ్, ప్రభాస్, ఎన్టీఆర్, చరణ్, రజినీ, ధోనీ, కోహ్లీ.. ఇలా ఎంతోమంది సెలబ్రిటీలకు ఆయన హెయిర్ స్టైలిస్ట్ మరి. ఒకప్పుడు సాధారణ బార్బరే క్రమేపీ సెలబ్రిటీగా మారాడు.

News March 23, 2025

బడి, గుడి ఏదైనా బీఆర్ఎస్ ప్రభుత్వమే కట్టింది: కేటీఆర్

image

TG: కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందేనని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. సీఎం రేవంత్ తెలంగాణలో దోచి ఢిల్లీకి కట్టబెడుతున్నారని ఆరోపించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్‌ని ఏం అడిగినా శివం, శవం అంటూ ముచ్చట చెబుతున్నారని దుయ్యబట్టారు. బడి, గుడి ఏదైనా బీఆర్ఎస్ ప్రభుత్వమే కట్టిందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం చారిత్రక అవసరమని పేర్కొన్నారు.

News March 23, 2025

పార్లమెంట్‌లో రేపు అరకు కాఫీ స్టాళ్లు ప్రారంభం

image

AP: ఢిల్లీలోని పార్లమెంట్ ప్రాంగణంలో రేపటి నుంచి రెండు అరకు కాఫీ స్టాళ్లు అందుబాటులోకి రానున్నాయి. స్పీకర్ ఓం బిర్లా అనుమతితో లోక్‌సభ భవనాల డైరెక్టర్ కుల్ మోహన్ సింగ్ ఉత్తర్వులిచ్చారు. ఇటీవల అమరావతిలోని అసెంబ్లీ ప్రాంగణంలోనూ అరకు కాఫీ స్టాళ్లను స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రారంభించిన విషయం తెలిసిందే.

error: Content is protected !!