News April 15, 2025
ఇంటర్ సిలబస్ మార్పు..! త్వరలో అధికారిక ప్రకటన

TG: వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇంటర్ ఫస్టియర్ సిలబస్ మారనున్నట్లు బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య తెలిపారు. జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా ఈ మార్పు ఉంటుందన్నారు. సెకండ్ లాగ్వేజ్‌గా సంస్కృతాన్ని చేరుస్తున్నారన్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. కాగా పాఠ్యాంశాల మార్పుపై సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్స్ కమిటీ ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక అందించింది. దీనికి ఆమోదం లభించాక బోర్డు అధికారికంగా ప్రకటించనుంది.
Similar News
News April 23, 2025
వల్లభనేని వంశీకి రిమాండ్ పొడిగింపు

AP: టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీకి విజయవాడ సీఐడీ కోర్టు మరోసారి రిమాండ్ పొడిగించింది. వచ్చే నెల 7 వరకు ఆయనకు రిమాండ్ విధిస్తున్నట్లు న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. దీంతో పోలీసులు ఆయనను విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. కాగా సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో కూడా నిన్న వంశీకి ఎస్సీ, ఎస్టీ కోర్టు మే 6 వరకు రిమాండ్ పొడిగించిన విషయం తెలిసిందే.
News April 23, 2025
ఇంటర్ ఫెయిల్.. సివిల్స్ ర్యాంకర్

AP: పరీక్షల్లో ఫెయిలయ్యామంటే చాలు కొంతమంది తమ కథ ముగిసిందని చదువు ఆపేయడమో లేదా జీవితాన్నే ముగించడమో చేస్తుంటారు. అయితే తిరుపతికి చెందిన సురేశ్ మాత్రం ఇంటర్‌లో ఫెయిలయినప్పటికీ ఏమాత్రం నిరాశ చెందలేదు. తన విధిరాతను ఎదుర్కొన్నాడు. సంకల్ప దీక్షతో చదివాడు. భారతదేశంలోనే అత్యున్నత పరీక్షగా భావించే సివిల్ సర్వీస్ సాధించాడు. జాతీయ స్థాయిలో 988వ ర్యాంకు సాధించి కృషి ఉంటే అసాధ్యమేదీ లేదని నిరూపించాడు.
News April 23, 2025
స్కూళ్లకు సెలవులు షురూ

ఏడాదంతా పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులకు ఉపశమనం లభించనుంది. తెలుగు రాష్ట్రాల్లోని స్కూళ్లకు ఇవాళ చివరి వర్కింగ్ డే ముగిసింది. రేపటి నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ఉంటాయి. 12న స్కూళ్లు రీఓపెన్ అవుతాయి. ప్రస్తుతం ఎండలు ముదిరినందున పిల్లలు మధ్యాహ్నం వేళల్లో బయటికెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. అలాగే ఈత కోసం చెరువులు, కాల్వల వద్దకు వెళ్లినప్పుడు జాగ్రత్త వహించాలి.