News December 3, 2024
వడ్డీ రేట్ల కోత ఈసారి కూడా కష్టమే!

రెపో రేటు కోత ఈసారి కూడా ఉండదని తెలుస్తోంది. RBI ద్రవ్య విధాన కమిటీ సమావేశం బుధవారం నుంచి ప్రారంభంకానుంది. 3 రోజులపాటు జరిగే సమావేశ నిర్ణయాలను శుక్రవారం వెల్లడిస్తారు. మార్కెట్ వర్గాలు, సామాన్యులు ఎదురుచూస్తున్న వడ్డీ రేట్ల కోతకు ఈసారీ ఛాన్స్‌లేదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. GDP వృద్ధి రెండేళ్ల కనిష్ఠ స్థాయి 5.4 శాతానికి పడిపోవడంతో రేట్ల కోతకు RBI సాహసించదని తెలుస్తోంది.
Similar News
News April 19, 2026
మధ్యాహ్నం వరకు ఎండలు.. ఆపై వర్షాలు

TG: ఇవాళ రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొంటాయని నిపుణులు తెలిపారు. ఇప్పటికే ఎండలు దంచికొడుతుండగా మధ్యాహ్నం నుంచి వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు. చాలా ప్రాంతాల్లో మధ్యాహ్నం 42–45°C వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని.. ఆపై HYD, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిర్మల్, NZB, సిరిసిల్ల, సిద్దిపేట, జగిత్యాల, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలో వానలు పడే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు.
News April 19, 2026
మరో ఏడాదిపాటు చీఫ్ సెలక్టర్‌గా అగార్కర్!

బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ పదవీ కాలాన్ని బోర్డు పొడిగించనున్నట్లు నేషనల్ మీడియా తెలిపింది. 2027 జూన్ వరకు ఎక్స్‌టెండ్ చేయనున్నట్లు పేర్కొంది. 2023లో అగార్కర్ చీఫ్ సెలక్టర్ అయిన తర్వాత భారత్ 2024, 2026 టీ20 వరల్డ్ కప్‌తో పాటు 2025 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. ఇక విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అశ్విన్ టెస్టుల నుంచి రిటైర్ కావడానికి ఆయనే కారణమని విమర్శలూ వచ్చిన సంగతి తెలిసిందే.
News April 19, 2026
పవన్ త్వరలోనే కోలుకుంటారు: ప్రధాని మోదీ

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఫోన్ చేసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ‘పవన్ కళ్యాణ్ ధైర్యవంతుడు. ఆయన త్వరలోనే కోలుకుంటారు. ఆయన ఆరోగ్యంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా’ అని పేర్కొన్నారు. సైనసైటిస్‌తో బాధపడుతున్న పవన్ కళ్యాణ్‌కు నిన్న <<19687368>>సర్జరీ<<>> జరిగిన సంగతి తెలిసిందే.


