News August 9, 2024
సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు
ఆప్ నేత మనీశ్ సిసోడియా బెయిల్ సందర్భంగా సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. జైలులో ఉండి 17 నెలలు గడిచినా విచారణ జరక్కపోవడంతో అప్పీలుదారు సత్వర విచారణ హక్కును కోల్పోయారని కోర్టు అభిప్రాయపడింది. శిక్షగా బెయిల్ నిలుపుదల చేయకూడదనే విషయాన్ని కోర్టులు మర్చిపోయినట్టున్నాయని వ్యాఖ్యానించింది. బెయిల్ అనేది నియమం అని, జైలు మినహాయింపుగా అభివర్ణించింది.
Similar News
News September 9, 2024
వాళ్ల ఫస్ట్ టార్గెట్ బీజేపీ ఆఫీస్: NIA
బెంగళూరు రామేశ్వరం కేఫ్‌లో మార్చి 1న జరిగిన బాంబు పేలుడు ఘటనపై ఎన్ఐఏ ఛార్జ్‌షీట్‌లో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ రోజే బెంగళూరులోని BJP ఆఫీసుపై నిందితులు ఐఈడీ దాడికి విఫలయత్నం చేశారని పేర్కొంది. తొలి టార్గెట్ మిస్ అవడంతో ఆ తర్వాత రామేశ్వరం కేఫ్ పేలుడికి ప్లాన్ చేశారంది. ఈ కేసులో నలుగుర్ని నిందితులుగా పేర్కొన్న NIA, అందులో ఇద్దరు ఐసిస్ రాడికల్స్ అని తెలిపింది.
News September 9, 2024
గ్రీన్ ఫార్మా సిటీ ప్రక్రియపై సీఎం రేవంత్ సమీక్ష
HYD శివారులోని ముచ్చెర్లలో గ్రీన్ ఫార్మా సిటీ అభివృద్ధి ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గ్రీన్ ఫార్మా పూర్తిగా కాలుష్య రహిత సిటీగా అభివృద్ధి జరగాలని చెప్పారు. రోడ్లు, ఇతర మౌలిక సదుపాయలు కల్పించే ప్రక్రియ వేగంగా జరగాలని సమీక్షలో దిశానిర్దేశం చేశారు. పెట్టుబడులకు ఇప్పటికే పేరొందిన ఫార్మా కంపెనీలు ముందుకొస్తున్నాయని, త్వరలోనే సంప్రదింపులు జరపాలని సూచించారు.
News September 9, 2024
BREAKING: ఆ రెండు జిల్లాల్లో రేపు స్కూళ్లకు సెలవు
AP: భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో అల్లూరి జిల్లావ్యాప్తంగా రేపు కూడా స్కూళ్లకు సెలవు ప్రకటిస్తూ కలెక్టర్ దినేశ్ ఉత్తర్వులిచ్చారు. ఏలూరు జిల్లాలోని భీమడోలు, పెదపాడు, మండవల్లి, కైకలూరు, ఏలూరు, ముదినేపల్లి, కలిదిండి మండలాల్లోని పలు పాఠశాలలకు అధికారులు సెలవు ఇచ్చారు. మిగతా స్కూళ్లు యథాతథంగా నడుస్తాయని చెప్పారు.