News June 30, 2024

పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన అంతర్జాతీయ నిపుణులు

image

AP: అంతర్జాతీయ నిపుణుల బృందం పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకుంది. డయాఫ్రం వాల్, స్పిల్ వే వంటి ప్రధాన నిర్మాణాలతో పాటు ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలను పరిశీలించారు. వారు 4 రోజులు పాటు ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతంలో పర్యటిస్తారు. ఒక్కోరోజు ఒక్కో విభాగాన్ని పరిశీలించి ప్రభుత్వానికి పూర్తి నివేదిక అందజేయనున్నారు. ఈ నివేదికను బట్టే పనులపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

Similar News

News September 20, 2024

లడ్డూ వ్యవహారం ఎవరూ ఊహించనిది: ప్రణిత

image

తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో జంతువుల కొవ్వులు వినియోగించారనే వార్తలపై నటి ప్రణితా సుభాష్ స్పందించారు. లడ్డూ తయారీలో జంతు కొవ్వులు వినియోగించడం వేంకటేశ్వరస్వామి భక్తులు ఊహించలేని విషయమని ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నానని తెలిపారు. మరోవైపు లడ్డూ వ్యవహారంలో దేశవ్యాప్తంగా చర్చనడుస్తోంది. అటు ఇదే వ్యవహారంలో టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.

News September 20, 2024

‘ఎన్టీఆర్-నీల్’ మూవీ షూటింగ్ ఎప్పటి నుంచంటే?

image

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో Jr.NTR హీరోగా నటించబోయే సినిమా షూటింగ్ అక్టోబర్ 21 నుంచి ప్రారంభం కానుంది. ‘దేవర’ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ షెడ్యూల్‌లో 40 రోజులపాటు ఇతర నటీనటులతో సీన్లను షూట్ చేస్తారని, తాను 2025 జనవరి నుంచి సెట్స్‌లో జాయిన్ అవుతానని పేర్కొన్నారు. 2026 జనవరి 9న రిలీజ్ కానున్న ఈ మూవీకి ‘డ్రాగన్’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు సమాచారం.

News September 20, 2024

నేడు సుప్రీంలో ఓటుకు నోటు కేసు విచారణ

image

ఓటుకు నోటు కేసును నేడు సుప్రీం కోర్టు విచారించనుంది. ఈ కేసును మధ్యప్రదేశ్‌కు బదిలీ చేయాలని BRS MLA జగదీశ్‌రెడ్డితో పాటు మరికొందరు నేతలు పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఆ పిటిషన్‌పై ఈరోజు జస్టిస్ బీఆర్.గవాయ్, జస్టిస్ కేవీ.విశ్వనాథన్‌ల ధర్మాసనం విచారించనుంది. ఇప్పటికే పలుమార్లు ఈ కేసు విచారణకు రాగా సర్వోన్నత న్యాయస్థానం తీర్పును వాయిదా వేస్తూ వచ్చింది.