News September 20, 2024
లడ్డూ వ్యవహారం ఎవరూ ఊహించనిది: ప్రణిత
తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో జంతువుల కొవ్వులు వినియోగించారనే వార్తలపై నటి ప్రణితా సుభాష్ స్పందించారు. లడ్డూ తయారీలో జంతు కొవ్వులు వినియోగించడం వేంకటేశ్వరస్వామి భక్తులు ఊహించలేని విషయమని ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నానని తెలిపారు. మరోవైపు లడ్డూ వ్యవహారంలో దేశవ్యాప్తంగా చర్చనడుస్తోంది. అటు ఇదే వ్యవహారంలో టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.
Similar News
News October 7, 2024
నేడు అకౌంట్లలోకి డబ్బులు
AP: సాంకేతిక కారణాలతో వరద పరిహారం అందని బాధితులకు నేడు ప్రభుత్వం డబ్బులు చెల్లించనుంది. ఎన్టీఆర్ జిల్లాల్లో 15వేలు, అల్లూరి జిల్లాలో 4,620 మంది, ఇతర జిల్లాల్లోని పలువురు బాధితుల అకౌంట్లలో డబ్బులు జమ చేయనుంది. వీరందరికి దాదాపు రూ.18 కోట్ల లబ్ధి చేకూరనుంది. ఇప్పటికే 98 శాతం మంది బాధితులకు రూ.584 కోట్ల పరిహారం చెల్లించిన విషయం తెలిసిందే.
News October 7, 2024
ఇకపై శ్రీవారి లడ్డూలు వేగంగా పంపిణీ
AP: భక్తులకు శ్రీవారి లడ్డూలను మరింత సులభంగా, వేగంగా అందించేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది. ప్రస్తుతం దర్శన టికెట్ లేని భక్తులు తమ ఆధార్ కార్డును కౌంటర్‌లో ఇస్తే అందులోని వివరాలు ఎంటర్ చేసుకుని 2 లడ్డూలు ఇస్తున్నారు. దీనివల్ల ఎక్కువ సమయం వృథా అవుతోంది. దీంతో ఆధార్‌ను క్షణాల్లో స్కాన్ చేసే అధునాతన విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
News October 7, 2024
టీటీడీపై అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు: ఈవో
AP: తిరుమల తిరుపతి దేవస్థానం(TTD)పై అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఈవో శ్యామలరావు హెచ్చరించారు. టీటీడీని తక్కువ చేసేలా సోషల్ మీడియాలో పుకార్లు వ్యాప్తి చేస్తే చర్యలు తప్పవన్నారు. ఇటీవల అన్నప్రసాదంలో జెర్రీ వచ్చిందంటూ ప్రచారం చేసిన వారిపై కేసు నమోదు చేసినట్లు తిరుమల పోలీసులు తెలిపారు.