News September 18, 2024

ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ సౌకర్యం: మంత్రి శ్రీధర్ బాబు

image

TG: రాష్ట్రంలో ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. సంగుపేట(సంగారెడ్డి), మద్దూరు(నారాయణ పేట), అడవి శ్రీరాంపూర్(పెద్దపల్లి) గ్రామాల్లో ప్రయోగాత్మకంగా దీన్ని అమలు చేయనున్నట్లు మీడియాతో చెప్పారు. ఇంటర్నెట్‌తో పాటు కేబుల్ టీవీ సేవలు, 20 MBPS అపరిమిత డేటా ఆప్టికల్ ఫైబర్ ద్వారా అందిస్తామన్నారు. ఇప్పటి వరకు 8వేల గ్రామాలకు ఫైబర్ కేబుల్ ఏర్పాటు చేశామని వెల్లడించారు.

Similar News

News November 27, 2025

అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ఏ గ్రామాల మీద వెళ్తుందో తెలుసా..!

image

ఆమరావతి ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్‌ఆర్) ప్రాజెక్టుకు సంబంధించి NHAI మొదటి గెజిట్ నోటిఫికేషన్ ఇప్పటికే జారీ చేసింది. దీని ద్వారా 9 గ్రామాల్లో మొత్తం 1,173 ఎకరాల భూమి సేకరిస్తారు. లింగాపురం, ధరణికోట, ముస్సాపురం, పాటిబండ్ల, జలాల్ పురం, కంభంపాడు, తాళ్లూరు, లింగంగుంట్ల, బలుసుపాడు గ్రామాలలో భూ సేకరణకు రంగం సిద్ధం అవుతుంది. అమరావతి ఓఆర్‌ఆర్ 189.4 కిలోమీటర్ల పొడవు, ఆరు లైన్లతో ఐదు జిల్లాల మీదగా వెళ్తుంది.

News November 27, 2025

వేరుశనగ, మొక్కజొన్న పంటలకు పందుల నుంచి రక్షణ ఇలా..

image

వేరుశనగ, మొక్కజొన్న పంటలకు పందుల నుంచి ముప్పు ఎక్కువగా ఉంటుంది. దీనికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వేరుశనగ పొలం చుట్టూ 4 వరుసల్లో కుసుమ పంట వేస్తే ఆ మొక్క ముళ్లు పందిని గాయపర్చే అవకాశం ఉంది. కుసుమ మొక్క వాసన ఘాటుగా ఉండడం వల్ల వేరుశనగ పంట వైపు పందులు రావు. మొక్కజొన్న పంట చుట్టూ ఆముదం పంటను వేసి రక్షించుకోవచ్చు. అలాగే ముళ్లు గల ఎడారి మొక్కలు, వాక్కాయ మొక్కలను పెంచి పంటలను కాపాడుకోవచ్చు.

News November 27, 2025

RVNLలో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (<>RVNL<<>>)లో 17 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. డిప్లొమా, బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్, మేనేజర్, డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు ఉన్నాయి. రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://rvnl.org/