News July 23, 2024
నెలకు రూ.5వేలు ఇస్తూ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్

దేశంలో కోటి మంది యువతకు లబ్ధి చేకూరేలా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో కీలక ప్రకటన చేశారు. దేశంలోని టాప్ 500 కంపెనీల్లో నిరుద్యోగులకు ఇంటర్న్‌షిప్ ఇప్పించనుంది. 12 నెలల పాటు నెలకు రూ.5,000 ఇవ్వడంతో పాటు వన్‌టైమ్ అసిస్టెన్స్ కింద రూ.6,000 చెల్లిస్తుంది.
Similar News
News November 20, 2025
నెలాఖరులోగా ఎయిర్‌పోర్టు భూసేకరణ పూర్తి!

మామునూర్ ఎయిర్‌పోర్టు భూసేకరణ కొలిక్కి వస్తోంది. భూసేకరణలో 330 మంది భూమిని కోల్పోగా, వారిలో 180మంది రైతుల ఖాతాల్లో ఇప్పటికే రూ.120 కోట్లు జమయ్యాయి. మరో 80 మందికి త్వరలోనే రూ.60 కోట్లు పడనున్నాయి. ఈ నెలాఖరు వరకు భూసేకరణ పూర్తి చేయాలని రెవెన్యూ అధికారులు భావిస్తున్నారు. 220 ఎకరాలను సేకరించగా, వాటిలో 20ఎకరాల బాధితులు కోర్టును ఆశ్రయించారు. 330 మందికి మొత్తం రూ.295కోట్లను ప్రభుత్వం పరిహారం అందించనుంది.
News November 20, 2025
542 ఉద్యోగాలు.. దరఖాస్తు చేశారా?

బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్(BRO)లో 542 పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అర్హతగల అభ్యర్థులు నవంబర్ 24లోపు అప్లై చేసుకుని దరఖాస్తును స్పీడ్ పోస్టులో పంపాలి. వెహికల్ మెకానిక్, MSW పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి టెన్త్, ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. రాతపరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్, PET, ట్రేడ్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://bro.gov.in/
News November 20, 2025
ఫస్ట్ వింగ్‌కమాండర్ డా.విజయలక్ష్మి రమణన్

భారత వైమానిక దళ మొదటి వింగ్ కమాండర్ డాక్టర్ విజయలక్ష్మి రమణన్. 1924లో జన్మించిన ఆమె మద్రాస్ మెడికల్ కాలేజీలో చదువుకుని చెన్నైలోని ఎగ్మోర్ ఆసుపత్రిలో సేవలందించారు. 1955లో ఆర్మీ మెడికల్ కార్ప్స్లో చేరి గైనకాలజిస్ట్‌గా, తొలి మహిళా అధికారిణిగా నియమితులయ్యారు. 1962, 1966, 1971 యుద్ధాల్లో గాయపడిన సైనికులకు ఆమె చికిత్స అందించారు. 1977లో విశిష్ట సేవా అవార్డును అందుకున్న ఆమె 1979లో పదవీ విరమణ చేశారు.


