News July 23, 2024
నెలకు రూ.5వేలు ఇస్తూ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్

దేశంలో కోటి మంది యువతకు లబ్ధి చేకూరేలా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో కీలక ప్రకటన చేశారు. దేశంలోని టాప్ 500 కంపెనీల్లో నిరుద్యోగులకు ఇంటర్న్‌షిప్ ఇప్పించనుంది. 12 నెలల పాటు నెలకు రూ.5,000 ఇవ్వడంతో పాటు వన్‌టైమ్ అసిస్టెన్స్ కింద రూ.6,000 చెల్లిస్తుంది.
Similar News
News July 8, 2025
ప్రెస్ క్లబ్‌కు చేరుకున్న కేటీఆర్

TG: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్ నుంచి సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్‌కు చేరుకున్నారు. రైతు సంక్షేమంపై సీఎం రేవంత్‌తో చర్చించేందుకు తాను సిద్ధమని ప్రకటించారు. సీఎం కోసం ఓ కుర్చీ కూడా వేశామని ఆయన చెప్పారు. ఆయన వస్తే చర్చించడానికి తాను సిద్ధమని స్పష్టం చేశారు. కాగా సీఎం రేవంత్ ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు.
News July 8, 2025
YSRకు TPCC ఘన నివాళులు

TG: ఉమ్మడి ఏపీ మాజీ సీఎం, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి టీపీసీసీ నేతలు గాంధీభవన్‌లో నివాళులర్పించారు. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, సీతక్క, ఇతర పార్టీ నేతలు నివాళుర్పించిన వారిలో ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆయన చేసిన సేవలను కొనియాడారు.
News July 8, 2025
లండన్‌లో అడుగుపెట్టిన టీమ్ ఇండియా

ఇంగ్లండ్‌తో జరగబోయే మూడో టెస్టు కోసం టీమ్ ఇండియా లండన్ చేరుకుంది. హీత్రూ ఎయిర్‌పోర్టులో భారత ఆటగాళ్లకు ఘన స్వాగతం లభించింది. అక్కడి నుంచి ఆటగాళ్లు నేరుగా హోటల్‌కు వెళ్లినట్లు సమాచారం. కాగా ఎల్లుండి (ఈ నెల 10న) ప్రఖ్యాత లార్డ్స్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య మూడో టెస్టు ప్రారంభం కానుంది. భారత్, ఇంగ్లండ్ జట్లు 5 టెస్టుల సిరీస్‌లో 1-1తో సమంగా కొనసాగుతున్నాయి.