News June 19, 2024
జగన్ ఆస్తుల కేసుల విచారణ వాయిదా

హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ కోర్టులో జగన్ ఆస్తుల కేసుల విచారణ వాయిదా పడింది. న్యాయమూర్తి సెలవులో ఉండటంతో విచారణ రేపటికి వాయిదా వేశారు. గతంలో సీఎంగా ఉండటంతో విచారణలో వాయిదాలు కోరుతూ వచ్చిన జగన్ ఇప్పుడు విచారణకు హాజరవుతారా? లేదా? అనేది ఆసక్తిగా మారింది.
Similar News
News April 10, 2026
ఆర్టీసీ సమ్మె సైరన్ మోగనుందా?

TG: రాష్ట్రంలో RTC సమ్మె సైరన్ మోగేలా కన్పిస్తోంది. కార్మికుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని తెలంగాణ RTC జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. లేకపోతే ఈ నెల 23న సమ్మెకు వెళ్లే అవకాశం ఉందని చెప్పారు. ఇప్పటికే సమ్మె నోటీసులు ఇచ్చామన్నారు. 13వ తేదీ లేబర్ కమిషనర్, RTC యాజమాన్యంతో చర్చిస్తామని నేతలు తెలిపారు. కాగా నిన్న HYDలో లేబర్ కమిషనర్ ఆధ్వర్యంలో సమావేశం జరగాల్సి ఉండగా వాయిదా పడింది.
News April 10, 2026
9,175 ఉద్యోగాలకు నోటిఫికేషన్

CRPFలో 9,175 కానిస్టేబుల్(మెన్స్-9,096, ఉమెన్స్-79) ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఏపీలో 504, టీజీలో 356 పోస్టులున్నాయి. టెక్నికల్, ట్రేడ్స్‌మెన్, పయనీర్ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేస్తారు. ఈ నెల 20 నుంచి మే 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, సంబంధిత విభాగంలో ITI పాసైన వారు అర్హులు. వయసు 18-23 ఏళ్లు ఉండాలి.
వెబ్‌సైట్: https://www.rect.crpf.gov.in
News April 10, 2026
వాట్సాప్ మెసేజ్‌లను చదివేస్తున్నారంటూ USలో పిటిషన్!

వాట్సాప్ తన యూజర్లను మోసం చేసిందంటూ USలో పిటిషన్ దాఖలైంది. ‘ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌తో మెసేజ్‌లు సేఫ్ అని మెటా చెప్పింది. కానీ ఉద్యోగులు, కాంట్రాక్ట్ కంపెనీలకు ప్రైవేట్ చాట్స్ చదివేందుకు, స్టోర్ చేసేందుకు అనుమతినిచ్చింది’ అని పిటిషనర్ చెబుతున్నారు. యూజర్ల నమ్మకాన్ని జుకర్‌బర్గ్ వమ్ము చేశారని, మెసేజ్‌లు సేఫ్ కాదని ఆరోపిస్తున్నారు. దీనిపై ఎలాన్ మస్క్, Paytm ఫౌండర్ విజయ్ ఆందోళన వ్యక్తం చేశారు.


