News November 17, 2024
Investing: ఈ స్కీమ్స్ మహిళలకు ప్రత్యేకం
మహిళలకు సామాజిక భద్రత, మంచి రిటర్న్ ఇచ్చే పోస్టాఫీసు స్కీమ్స్ కొన్ని ఉన్నాయి. సుకన్యా సమృద్ధి స్కీం కింద పదేళ్లలోపు ఆడపిల్లల పేరిట 15 ఏళ్లపాటు పెట్టుబడి పెట్టవచ్చు. 8.2% వడ్డీ లభిస్తుంది. నెలవారీ ఆదాయానికి Monthly Income Scheme, మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ కింద రూ.2 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. National Savings Certificate, PPF Schemes అందుబాటులో ఉన్నాయి.
Similar News
News December 8, 2024
నాగార్జునసాగర్ నుంచి APకి 12TMC నీరు
నాగార్జునసాగర్ నుంచి APకి 12TMCల నీరు విడుదల కానుంది. 15.86TMCల నీటిని విడుదల చేయాలని కృష్ణా నది యాజమాన్య బోర్డు(KRMB)ను AP ప్రభుత్వం కోరింది. కాగా, ఇప్పటికే వాడుకున్న జలాలను పరిగణనలోకి తీసుకొని 12TMCల నీటిని జనవరి 31 వరకు విడుదల చేసేందుకు KRMB అనుమతి ఇచ్చింది. గత నెల 25తేదీ నాటికి 9.55TMCల నీటిని వాడుకున్నామని, 32.25TMC జలాలను వాడుకునేందుకు అర్హత ఉందని AP ప్రభుత్వం లేఖలో తెలిపింది.
News December 8, 2024
ఫోన్ ట్యాపింగ్‌పై కేంద్రం కొత్త రూల్స్
అత్యవసర పరిస్థితుల్లో ఐజీ లేదా ఆ పైస్థాయి పోలీస్ ఆఫీసర్లు ఫోన్ ట్యాపింగ్‌కు ఆదేశించవచ్చని కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ట్యాపింగ్‌కు ఆదేశించిన అధికారి సదరు ఆదేశాలు నిజమైనవేనని 7 పనిదినాల్లో నిర్ధారించకపోతే ట్యాపింగ్ ద్వారా సేకరించిన డేటాను దేనికీ వాడొద్దని, 2 రోజుల్లో ఆ డేటాను ధ్వంసం చేయాలని తెలిపింది. ట్యాపింగ్ ఆదేశాలను సంబంధిత శాఖల కార్యదర్శుల కమిటీ సమీక్షించాల్సి ఉంటుందని పేర్కొంది.
News December 8, 2024
12న ఏపీలో భారీ వర్షాలు
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఇది 11న శ్రీలంక- తమిళనాడు మధ్య తీరం దాటొచ్చని అంచనా వేసింది. దీని ప్రభావంతో 12న ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. నేడు అనకాపల్లి, విశాఖ, కాకినాడ, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది.