News December 20, 2024

ఓర్వకల్లు పార్కులో రూ.14వేల కోట్ల పెట్టుబడులు: మంత్రి భరత్

image

AP: రాయలసీమలోని ఓర్వకల్లు ఇండస్ట్రియల్ పార్కుకు భారీ పెట్టుబడి రాబోతోందని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ట్వీట్ చేశారు. సెమీ కండక్టర్ రంగంలో రూ.14వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయన్నారు. దీని వల్ల పారిశ్రామిక వృద్ధితో పాటు ఎంతో మందికి ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ నాయకత్వంలో రాయలసీమను ఇన్నోవేషన్ హబ్‌గా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.

Similar News

News September 21, 2025

H1B వీసాలపై ఆంక్షలు.. ట్విస్ట్ ఏంటంటే?

image

కొత్తగా H1B వీసాకు దరఖాస్తు చేసుకునే వారికే <<17767574>>ఫీజు<<>> పెంపు వర్తిస్తుందని వైట్ హౌజ్ అధికారులు చెప్పారని NDTV పేర్కొంది. ప్రస్తుతం ఉన్నవారికి లేదా రెన్యూవల్ చేసుకునే వారిపై ఎలాంటి ప్రభావం ఉండబోదని వెల్లడించారని తెలిపింది. కాగా మెటా, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి కంపెనీలు H1B, H-4 వీసాలు ఉన్న తమ ఉద్యోగులను 14 రోజుల పాటు దేశం విడిచి వెళ్లవద్దని, ఇప్పటికే బయట ఉంటే వెంటనే వెనక్కి రావాలని ఆదేశించాయి.

News September 21, 2025

‘రంగు రంగు పూలు తెచ్చి రాశులు పోసి’

image

మహిళా శక్తికి, చైతన్యానికి ప్రతీకగా నిలిచే పండుగ ‘బతుకమ్మ’. నేటి నుంచి తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ పూల పండుగను మహిళలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. ప్రకృతి ఇచ్చిన పూలను దేవతగా భావించి ఆరాధిస్తారు. తొలి రోజును చిన్న బతుకమ్మ లేదా ఎంగిలి పూల బతుకమ్మగా పిలుస్తారు. ముందు రోజే సేకరించిన పూలతో బతుకమ్మను తయారు చేయడం, కొన్ని ప్రాంతాల్లో ఆహారం తిన్న తర్వాత తయారు చేయడంతో ఇలా పిలుస్తారని పూర్వీకులు చెబుతారు.

News September 21, 2025

ఈ గౌరవం నా ఒక్కడిదే కాదు: మోహన్ లాల్

image

దాదాసాహెబ్ ఫాల్కే <<17774717>>అవార్డుకు<<>> ఎంపికవ్వడం నిజంగా గర్వకారణమని నటుడు మోహన్ లాల్ ట్వీట్ చేశారు. ఈ గౌరవం తన ఒక్కడిదే కాదని, తన ప్రయాణంలో పక్కనే ఉండి నడిచినవారిదని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు, ప్రేక్షకులు, సహచరులు, స్నేహితులు, శ్రేయోభిలాషుల ప్రేమ, నమ్మకం వల్లే ఈ స్థాయిలో ఉన్నానని తెలిపారు. డైరెక్టర్ అదూర్ గోపాలకృష్ణన్(2004) తర్వాత మలయాళం నుంచి ఈ అవార్డు అందుకోనున్న రెండో వ్యక్తి మోహన్ లాల్.