News December 20, 2024
ఓర్వకల్లు పార్కులో రూ.14వేల కోట్ల పెట్టుబడులు: మంత్రి భరత్
AP: రాయలసీమలోని ఓర్వకల్లు ఇండస్ట్రియల్ పార్కుకు భారీ పెట్టుబడి రాబోతోందని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ట్వీట్ చేశారు. సెమీ కండక్టర్ రంగంలో రూ.14వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయన్నారు. దీని వల్ల పారిశ్రామిక వృద్ధితో పాటు ఎంతో మందికి ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ నాయకత్వంలో రాయలసీమను ఇన్నోవేషన్ హబ్‌గా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.
Similar News
News January 13, 2025
టెస్టు కెప్టెన్‌గా జైస్వాల్‌ను ప్రతిపాదించిన గంభీర్?
రోహిత్ తర్వాత టెస్టు కెప్టెన్ ఎవరనే దానిపై BCCI తీవ్ర కసరత్తు చేస్తోంది. నిన్న, ఈరోజు అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ, కోచ్ గంభీర్ సుదీర్ఘంగా చర్చలు జరిపారు. బుమ్రాకు కెప్టెన్సీ ఇస్తే వర్క్‌లోడ్ ఎక్కువవుతుందని భావించినట్లు తెలుస్తోంది. ఈక్రమంలోనే సెలక్షన్ కమిటీ తెరపైకి పంత్ పేరును తీసుకొచ్చిందని సమాచారం. అయితే గంభీర్ అనూహ్యంగా జైస్వాల్ పేరును ప్రతిపాదించారట. మరి దీనిపై BCCI ఏమంటుందో చూడాలి.
News January 13, 2025
ఉక్రెయిన్‌తో యుద్ధంలో కేరళ వాసి మృతి
ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యా తరఫున పోరాడుతున్న కేరళలోని త్రిసూర్ వాసి బినిల్(32) మృతి చెందారు. మరొకరు గాయపడ్డారు. కొన్ని రోజుల క్రితం వీరు డ్రోన్ దాడిలో గాయపడినట్టు ఫ్యామిలీకి సమాచారం వచ్చింది. బినిల్ భార్య మాస్కోలోని భారత ఎంబసీని సంప్రదించగా ఆయన మృతిని వారు మౌఖికంగా అంగీకరించారు. తిరిగి ఇంటికి చేరుకొనేందుకు బాధితులిద్దరూ గతంలో విఫలప్రయత్నాలు చేసినట్టు తెలుస్తోంది.
News January 13, 2025
బ్రాహ్మణులు నలుగురు పిల్లల్ని కంటే రూ.లక్ష.. ఎక్కడంటే?
యువ బ్రాహ్మణ దంపతులకు MP ప్రభుత్వ ఆధ్వర్యంలోని పరశురామ్ కళ్యాణ్ బోర్డు ఆఫర్ ప్రకటించింది. నలుగురు పిల్లలను కంటే రూ.లక్ష బహుమతిగా ఇస్తామని ఆ బోర్డు అధ్యక్షుడు పండిత్ విష్ణు రాజోరియా వెల్లడించారు. ‘మనం కుటుంబాలపై దృష్టి పెట్టట్లేదు. యువత ఒక బిడ్డతోనే ఆగిపోతోంది. ఇది ఇబ్బందికరంగా మారుతోంది. భవిష్యత్ తరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత వారిపై ఉంది. అందుకే కనీసం నలుగురు పిల్లల్ని కనాలి’ అని పేర్కొన్నారు.