News July 18, 2024
రూ.57 లక్షల పెట్టుబడి.. 9 ఏళ్లలోనే 200 రెట్లు లాభం!
అత్యంత తక్కువ వ్యవధిలోనే వ్యాపారంలో పెట్టిన పెట్టుబడికి వందల రెట్లు లాభం పొందిన ఓ కంపెనీ గురించి తెలుసుకుందాం. వ్యాపార దిగ్గజాలు కునాల్ బహల్, రోహిత్ బన్సాల్ కలిసి హోమ్ సర్వీసెస్ అందించే ‘అర్బన్ కంపెనీ’ని రూ.57 లక్షల పెట్టుబడితో 2015లో ప్రారంభించారు. ఇది క్లిక్ అవ్వడంతో ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. ఇటీవల వారిద్దరు రూ.111 కోట్ల (200 రెట్ల లాభం)తో ఈ కంపెనీ నుంచి నిష్క్రమించారు.
Similar News
News December 5, 2024
మంచు దుప్పటిలా మారిన లార్డ్స్ స్టేడియం
క్రికెట్ మక్కాగా పిలుచుకునే లార్డ్స్ మైదానం మంచుతో నిండిపోయింది. మైదానం మొత్తం మంచు దుప్పటి పరచినట్లుగా మారింది. దీంతో స్టేడియం అందాలు రెట్టింపు అయ్యాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా క్రిస్మస్కు ముందు ఇంగ్లండ్‌లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దీంతో మంచు కూడా అధికంగా పడుతుంటుంది.
News December 5, 2024
నేడు ముంబైకి సీఎం చంద్రబాబు
AP: మహారాష్ట్ర సీఎం, మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు సీఎం చంద్రబాబు ఇవాళ ప్రత్యేక విమానంలో ముంబై వెళ్తున్నారు. ఎన్డీఏ నేతల ఆహ్వానం మేరకు ఆయన ఈ వేడుకలకు హాజరవుతున్నారు. రేపు, ఎల్లుండి విశాఖలో పర్యటిస్తారు. కాగా చంద్రబాబు పర్యటనల కో ఆర్డినేటర్‌గా మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేశ్ నియమితులయ్యారు. గతంలో చంద్రబాబు ఎన్నికల పర్యటనలను కూడా ఈయనే చూసుకున్నారు.
News December 5, 2024
అమ్మాయిలు అలాంటివాడినే ప్రేమిస్తున్నారు: షాహిద్
నేటి తరం అమ్మాయిలు కబీర్ సింగ్(తెలుగులో అర్జున్ రెడ్డి) వంటి అబ్బాయిల్నే ప్రేమిస్తున్నారని ఆ మూవీ హీరో షాహిద్ కపూర్ ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. ‘కబీర్ పాత్రని నేను కచ్చితంగా ఇష్టపడను. కానీ అలాంటి వారు సొసైటీలో ఉన్నారు. ఆ పాత్ర చేసే అనేక పనులు ఆమోదయోగ్యం కాదు. అయితే, చాలామంది అమ్మాయిలు అలాంటి వాళ్లను ప్రేమిస్తున్నారు. అందుకే ఆ సినిమా చేశాం. చూడాలా వద్దా అనేది ఆడియన్స్ ఇష్టం’ అని పేర్కొన్నారు.