News August 23, 2024
పెట్టుబడి రూ.10 లక్షలు – లాభం రూ.4.46 కోట్లు
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ వాల్యూ డిస్కవరీ ఫండ్ ఇన్వెస్టర్లకు లాభాల పంట పండించింది. 2004, ఆగస్టులో మొదలైన ఈ స్కీమ్ 21.02% CAGRతో అదరగొట్టింది. 20 ఏళ్ల క్రితం ఒకేసారి రూ.10 లక్షలు పెట్టుబడి పెట్టినవాళ్లకు ఇప్పుడు రూ.4.56 కోట్లు చేతికందాయి. ఇదే సమయంలో నిఫ్టీ 16.2% CAGRతో రూ.2 కోట్లే అందించింది. ఇక ఆరంభం నుంచీ నెలకు రూ.10వేలు సిప్ చేస్తే XIRR 19.41%తో ఆ విలువ రూ.2.30 కోట్లకు పెరిగేది.
Similar News
News September 21, 2024
తిరుమల లడ్డూ వివాదం.. కేరళ కాంగ్రెస్ సెటైరికల్ ట్వీట్
తిరుమల లడ్డూపై వివాదం కొనసాగుతున్న వేళ వేలాది ALT అకౌంట్లలో ఒకే తరహా ట్వీట్లు రావడంపై కేరళ కాంగ్రెస్ సెటైరికల్ ట్వీట్ చేసింది. ‘2-3 ఏళ్లుగా శ్రీవారి లడ్డూ రుచి చూడగానే మా అమ్మ అనారోగ్యం పాలయ్యేది. దాన్ని ఎక్కువగా తినొద్దని మాకు చెప్పేది. అందులో ఏదో తప్పుగా జరుగుతోందని ఇప్పుడు అర్థమైంది’ అంటూ ట్వీట్లు వచ్చాయి. దీంతో అందరికీ ఒకే అమ్మ ఉందా అనే అర్థంలో ‘వన్ నేషన్.. వన్ మామ్’ అని INC రాసుకొచ్చింది.
News September 21, 2024
వేమన నీతి పద్యం- తాత్పర్యం
చిక్కియున్నవేళ సింహంబునైనను
బక్కకుక్కకఱచి బాధ చేయు
బలిమి లేని వేళబంతంబు చెల్లదు
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: బలం తగ్గిపోయి చిక్కిపోయినప్పుడు సింహాన్ని కూడా కుక్క కరవగలదు. అందువల్ల మనకు బలం లేనప్పుడు పంతానికి పోవడం మంచిది కాదు.
News September 21, 2024
హెజ్‌బొల్లా టాప్ కమాండర్ హతం
ఇజ్రాయెల్-హెజ్‌బొల్లా మిలిటెంట్ల మధ్య భీకర వార్‌తో మిడిల్‌ఈస్ట్‌లో ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. తాజాగా ఇజ్రాయెల్ చేసిన అటాక్‌లో హెబ్‌బొల్లా ఆపరేషన్స్ కమాండర్ ఇబ్రహీం అకిల్ హతమయ్యాడు. 1983లో లెబనాన్ రాజధాని బీరుట్‌లోని US రాయబార కార్యాలయంపై బాంబు దాడిలో ఇతనిదే కీలక పాత్ర. అదే ఏడాది US మెరైన్ బ్యారక్స్‌పై అటాక్ చేశాడు. ఇతని ఆచూకీ చెబితే 70 లక్షల డాలర్ల రివార్డు ఇస్తామని గత ఏడాది అమెరికా ప్రకటించింది.