News November 25, 2024

రాజ్యాంగబద్ధంగానే అదానీ నుంచి పెట్టుబడులు: సీఎం

image

TG: రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగానే అదానీ నుంచి తెలంగాణలో పెట్టుబడులు స్వీకరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. రూల్స్ ప్రకారమే టెండర్లు పిలిచి ప్రాజెక్టులు ఇస్తున్నామన్నారు. దేశంలోని ఏ సంస్థలకైనా చట్టబద్ధంగా వ్యాపారం చేసుకునే హక్కు ఉంటుందన్నారు. అంబానీ, అదానీ, టాటా ఎవరికైనా వ్యాపారం చేసుకునే హక్కు ఉందన్నారు. చట్టబద్ధంగా ఉన్న సంస్థల నుంచే తాము కూడా పెట్టుబడులను ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు.

Similar News

News December 8, 2024

TODAY HEADLINES

image

☛ TG: ఈ నెల 15, 16 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు
☛ సంక్రాంతి తర్వాత రైతుభరోసా: సీఎం రేవంత్
☛ తెలంగాణలో(MBNR) మరోసారి భూ ప్రకంపనలు
☛ AP: పేరెంట్-టీచర్ మీటింగ్‌లో పాల్గొన్న CM CBN, పవన్ కళ్యాణ్
☛ ఏటా DSC నిర్వహిస్తాం: CM చంద్రబాబు
☛ పవన్‌పై చంద్రబాబు కుట్ర చేస్తున్నారు: విజయసాయిరెడ్డి
☛ 3 రోజుల్లోనే పుష్ప-2కి రూ.500 కోట్లకు పైగా కలెక్షన్స్
☛ అడిలైడ్ టెస్ట్: రెండో ఇన్నింగ్స్‌లో IND 128/5

News December 8, 2024

రష్యా-ఉక్రెయిన్ వార్‌పై జైశంకర్ కీలక వ్యాఖ్యలు

image

రష్యా-ఉక్రెయిన్ యుద్ధ పరిష్కారానికి అవకాశాలు కనిపిస్తున్నాయని విదేశాంగ మంత్రి జైశంకర్ పేర్కొన్నారు. యుద్ధం వల్ల ఇంధన ధరల పెరుగుదల, ఆహారం, ద్రవ్యోల్బణం, ఎరువుల కొరత సమస్యలు ఏర్పడ్డాయని తెలిపారు. Global Southలోని 125 దేశాల భావాలను భారత్ వినిపిస్తోందని, యూరోపియన్ నేతలు కూడా ఇరుదేశాల‌తో చర్చలు కొనసాగించాలని భారత్‌ను కోరారన్నారు. యుద్ధం కొనసాగింపు కంటే చర్చల వైపు పరిస్థితులు మారుతున్నట్లు చెప్పారు.

News December 8, 2024

ఒకేసారి న్యాయవాదులైన తండ్రీకూతురు

image

TG: జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన ఎలిగేటి శ్రీనివాస్ 50 ఏళ్ల వయసులో LLB కోర్సు చేశారు. ఆయన కూతురు కూడా ఇదే కోర్సు చేయడంతో తెలంగాణ బార్ కౌన్సిల్‌లో ఇవాళ ఇద్దరూ ఎన్‌రోల్‌మెంట్ చేసుకున్నారు. శ్రీనివాస్ మెట్‌పల్లిలో ఫ్లెక్సీ షాప్ నిర్వహిస్తూ శాతవాహన యూనివర్సిటీ నుంచి LLB పూర్తి చేశారు. కావ్య ఢిల్లీలోని సెంట్రల్ వర్సిటీ నుంచి పట్టాను పొందారు.