News September 6, 2024

రాష్ట్రపతి పరిశీలనకు ‘అపరాజిత బిల్లు’

image

బెంగాల్ గవర్నర్ ఆనంద బోస్ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన అపరాజిత బిల్లును రాష్ట్రపతి పరిశీలనకు పంపారు. సాంకేతిక నివేదిక అందాక ఈ మేరకు నిర్ణయించారు. అపరాజిత బిల్లు రూప‌క‌ల్ప‌న‌లో ప్రభుత్వం అనేక అంశాల‌ను విస్మ‌రించిందని పేర్కొన్నారు. బిల్లు అమలయ్యే వరకు ప్రజలు ఎదురుచూడలేరని, ఉన్న చట్టాలతోనే న్యాయం చేయాలన్నారు. హత్యాచార బాధితురాలి తల్లిదండ్రుల కన్నీళ్లు తుడవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు.

Similar News

News October 5, 2024

దసరా సెలవుల్లోనూ క్లాసులు.. విద్యార్థుల ఆవేదన

image

AP: ఈ నెల 2 నుంచే దసరా సెలవులు ప్రారంభమైనా కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు తరగతులు నిర్వహిస్తూనే ఉన్నాయి. ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోకుండా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ క్లాసులకు హాజరుకావాలని విద్యార్థులకు స్పష్టం చేస్తున్నాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా సెలవులతో సిలబస్ పూర్తికాలేదనే నెపంతో పిల్లలకు దసరా ఆనందాలను దూరం చేస్తున్నాయి. ఇలాంటి స్కూళ్లపై చర్యలు తీసుకోవాలని పేరెంట్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది.

News October 5, 2024

ఆన్‌లైన్ బెట్టింగ్.. 2 కుటుంబాలు బలి

image

ఆన్‌లైన్ బెట్టింగ్ కుటుంబాల్లో విషాదం నింపుతోంది. తెలంగాణలోని వడ్డేపల్లి(నిజామాబాద్)లో హరీశ్ అనే యువకుడు రూ.50 లక్షలకుపైగా కోల్పోయాడు. పేరెంట్స్ పొలం అమ్మినా అప్పు తీరకపోవడంతో ముగ్గురూ ఉరివేసుకున్నారు. ఏపీలోని గంగాధర నెల్లూరు(చిత్తూరు)లో దినేశ్ రూ.కోటి పోగొట్టుకున్నాడు. ఆ మొత్తాన్ని తీర్చలేక తల్లిదండ్రులు, అక్కతోపాటు పురుగుమందు తాగాడు. పేరెంట్స్ చనిపోగా, అక్క, సోదరుడు చికిత్స పొందుతున్నారు.

News October 5, 2024

TENTH: రెండు రోజులపాటు సైన్స్ ఎగ్జామ్

image

TG: పదో తరగతి వార్షిక పరీక్షల్లో జనరల్ సైన్స్ పేపర్‌ను రెండు రోజులపాటు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఫిజికల్ సైన్స్, బయాలజీ పేపర్లను ఇప్పటివరకు ఒకే రోజు నిర్వహిస్తూ వచ్చారు. ఇక నుంచి వేర్వేరు రోజుల్లో నిర్వహించాలని విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో పేపర్‌కు ఎప్పటిలాగే 1.30hrs సమయం ఇవ్వనున్నట్లు తెలిపింది. కరోనా సంక్షోభం తర్వాత టెన్త్‌ పేపర్లను 11నుంచి 6కు కుదించిన సంగతి తెలిసిందే.