News September 30, 2024
దసరా ఉత్సవాలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం
AP: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవీశరన్నవరాత్రి ఉత్సవాలకు సీఎం చంద్రబాబును దేవదాయశాఖ ఆహ్వానించింది. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, దేవదాయశాఖ కమిషనర్ సీఎంకు ఆహ్వాన పత్రిక అందించారు. కాగా అక్టోబర్ 3 నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Similar News
News October 11, 2024
కొన్నిసార్లు హార్దిక్ పాండ్య… : SKY
బంగ్లాతో రెండో టీ20లో కుర్రాళ్ల ఆటతీరుతో హార్దిక్ పాండ్య బౌలింగ్ చేయాల్సిన అవసరం రాలేదని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అన్నారు. ‘మా మిడిలార్డర్ బ్యాటర్లు ప్రెజర్లో ఆడాలని, తమను తాము ఎక్స్‌ప్రెస్ చేసుకోవాలని కోరుకుంటా. రింకూ, నితీశ్, పరాగ్ మేం ఆశించినట్టే ఆడారు. వేర్వేరు సందర్భాల్లో బౌలర్లు భిన్నంగా ఎలా బౌలింగ్ చేస్తారో పరీక్షిస్తుంటాం. అందుకే కొన్నిసార్లు పాండ్య, సుందర్ బౌలింగ్ చేయరు’ అని అన్నారు.
News October 11, 2024
నందిగం సురేశ్‌కు అస్వస్థత
AP: బాపట్ల వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అస్వస్థతకు గురయ్యారు. లో బీపీ, భుజం, ఛాతీలో నొప్పి వస్తున్నట్లు ఆయన చెప్పడంతో జైలు అధికారులు గుంటూరు జీజీహెచ్‌కు తరలించి వైద్య పరీక్షలు చేయిస్తున్నారు. చంద్రబాబు ఇంటిపై దాడి కేసు, మరియమ్మ అనే మహిళ హత్య కేసులో నిందితుడిగా ఉన్న సురేశ్‌కు న్యాయస్థానం రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే.
News October 11, 2024
డొనాల్డ్ ట్రంప్ ప్రకటనపై స్పందించిన కేజ్రీవాల్
అధికారంలోకొస్తే ఏడాదిలోపు విద్యుత్ ఛార్జీలను సగానికి తగ్గిస్తానన్న డొనాల్డ్ ట్రంప్ ప్రకటనపై EX CM కేజ్రీవాల్ స్పందించారు. ‘ఉచితాలు అమెరికా వరకు చేరుకున్నాయి’ అని ట్వీట్ చేశారు. అయితే, NDA పాలిత రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్ అమలు చేస్తే BJP తరఫున ప్రచారం చేస్తానని కేజ్రీవాల్ ఇటీవల సవాల్ విసిరారు. తాజాగా ట్రంప్ ప్రకటనపై స్పందించడం వెనుక ఆయన BJPని టార్గెట్ చేశారన్న ప్రచారం జరుగుతోంది.