News August 20, 2024
‘అలయ్ బలయ్’కి రావాలని సీఎంకు ఆహ్వానం

TG: బండారు దత్తాత్రేయ అనగానే గుర్తొచ్చేది ‘అలయ్ బలయ్’. ఏటా దసరా మరుసటి రోజున రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయన హరియాణా గవర్నర్‌గా ఉన్నప్పటికీ ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. అక్టోబర్ 13న జరిగే ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డిని ఆయన ఆహ్వానించారు. ఈ విషయాన్ని సీఎం ట్వీట్ చేశారు. తెలంగాణ సమాజంలో ఆత్మీయత, అనుబంధాలకు ప్రతీక ఈ కార్యక్రమమని పేర్కొన్నారు.
Similar News
News November 1, 2025
ఢిల్లీకి సంజూ.. రాజస్థాన్‌కు స్టబ్స్?

IPL వేలానికి ముందు రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య కీలక స్వాప్ డీల్ పూర్తయినట్లు సమాచారం. RR కెప్టెన్ సంజూ శాంసన్, DC ప్లేయర్ ట్రిస్టన్ స్టబ్స్ జట్లు మారడం ఖాయమైనట్లు తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుందని IPL వర్గాలు చెబుతున్నాయి. KL రాహుల్ పేరు కూడా చర్చల్లోకి వచ్చినప్పటికీ ఆయనను వదులుకోవడానికి ఢిల్లీ సుముఖత చూపలేదు. 2026 సీజన్‌కు సంజూను కెప్టెన్ చేయాలని DC భావిస్తోంది.
News November 1, 2025
కాసేపట్లో వర్షం

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న 2-3 గంటల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. నల్గొండ జిల్లాలో ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్, జనగాం, ఆసిఫాబాద్, మంచిర్యాల, రంగారెడ్డి, యాదాద్రిలో తేలికపాటి వర్షం పడే ఛాన్స్ ఉందని ఎల్లో అలర్ట్ ఇచ్చింది. గంటకు 40కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది.
News November 1, 2025
బిహార్‌లో ఎవరు గెలిచినా స్వల్ప మెజారిటీయే: JVC సర్వే

బిహార్‌లో పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ NDA, MGBల మధ్య వార్ నువ్వానేనా అన్నట్లు నడుస్తోంది. ఈ తరుణంలో ఏది గెలిచినా స్వల్ప మెజారిటీతోనే గట్టెక్కుతుందని JVC సర్వే చెబుతోంది. 243 సీట్లలో NDAకు 120-140 మధ్య సీట్లు రావచ్చంది. MGBకి 93-112 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. అయితే CM అభ్యర్థిగా తేజస్వీకి 33%, నితీశ్‌కు 29% మంది మద్దతు తెలిపారు. ప్రశాంత్ కిశోర్, చిరాగ్ పాశ్వాన్ 3వ ప్లేస్‌లో ఉన్నారు.


