News August 20, 2024
‘అలయ్ బలయ్’కి రావాలని సీఎంకు ఆహ్వానం

TG: బండారు దత్తాత్రేయ అనగానే గుర్తొచ్చేది ‘అలయ్ బలయ్’. ఏటా దసరా మరుసటి రోజున రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయన హరియాణా గవర్నర్‌గా ఉన్నప్పటికీ ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. అక్టోబర్ 13న జరిగే ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డిని ఆయన ఆహ్వానించారు. ఈ విషయాన్ని సీఎం ట్వీట్ చేశారు. తెలంగాణ సమాజంలో ఆత్మీయత, అనుబంధాలకు ప్రతీక ఈ కార్యక్రమమని పేర్కొన్నారు.
Similar News
News February 18, 2026
ప్రమాదానికి ఏడాది.. మళ్లీ పనులు మొదలు

TG: శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్(SLBC) తవ్వకం మళ్లీ మొదలైంది. డ్రిల్లింగ్, బ్లాస్టింగ్ పద్ధతిలో పనులు చేపట్టారు. గతేడాది ఫిబ్రవరిలో టీబీఎం మెషీన్‌తో తవ్వకాలు జరుపుతుండగా టన్నెల్ కూలిన విషయం తెలిసిందే. ఈ ఘోర ప్రమాదంలో 8 మంది మరణించారు. దీంతో మెషీన్ తవ్వకాలు నిలిపివేసి బ్లాస్టింగ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని భద్రతా ప్రమాణాలు పాటించి పనులు కొనసాగించాలని అధికారులను ఆదేశించింది.
News February 18, 2026
ప్రకృతి వ్యవసాయంలో APCNF కీలక పాత్ర

రైతులను రసాయన రహిత వ్యవసాయంవైపు నడిపించాలనే ఉద్దేశంతో 2016లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం APCNF(Andhra Pradesh Community Managed Natural Farming) ప్రోగ్రామ్ ప్రారంభించింది. దీని కింద సన్నకారు రైతులు రసాయన సేద్యం కాకుండా సహజ పద్ధతుల్లో వ్యవసాయం చేసేలా రైతు సాధికార సంస్థ కృషి చేస్తోంది. రాష్ట్రంలో వేలాది మంది రైతులు లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యం చేస్తూ మానవ ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్నారు.
News February 18, 2026
NBCC 59పోస్టులకు నోటిఫికేషన్

నేషనల్ బిల్డింగ్స్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్ (<


