News August 13, 2025
ఇండియాలో కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణకు IOA ఆమోదం

2030 కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణ బిడ్డింగ్‌కు భారత ఒలింపిక్ సంఘం(IOA) ఆమోదం తెలిపింది. అవకాశం వస్తే అహ్మదాబాద్ వేదికగా ఈ క్రీడలు నిర్వహించాలని భారత్ యోచిస్తోంది. కాగా బిడ్డింగ్ దాఖలుకు ఆగస్టు 31 వరకు అవకాశం ఉంది. ఇదే సమయంలో నిర్వహణ రేసు నుంచి తప్పుకుంటున్నట్లు కెనడా తాజాగా ప్రకటించడంతో భారత్‌కు అవకాశాలు మెరుగుపడ్డాయి.
Similar News
News August 13, 2025
జగన్ హాట్‌లైన్ కామెంట్స్.. స్పందించిన లోకేశ్

AP: చంద్రబాబు, రాహుల్ మధ్య <<17390003>>హాట్‌లైన్ <<>>ఉందంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి లోకేశ్ స్పందించారు. ‘మాకు ఏపీ ప్రజలతోనే హాట్‌లైన్ ఉంది. మీ ఓటు చోరీ సాకులను మర్చిపోండి. మీ నోట్‌చోరీతో విసిగి ప్రజలు మిమ్మల్ని దించేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించే మీ ప్రయత్నాలు విఫలమవుతాయి. మోదీ, చంద్రబాబు నాయకత్వంలో డబుల్ ఇంజిన్ సర్కార్‌లో ఏపీ మళ్లీ నం.1గా నిలుస్తుంది’ అని ధీమా వ్యక్తం చేశారు.
News August 13, 2025
ఆర్టీసీకి భలే గి‘రాఖీ’

TG: రాఖీ పౌర్ణమి సందర్భంగా RTC బస్సుల్లో 6 రోజుల్లో (ఆగస్టు 7-12) 3.68 కోట్ల మంది ప్రయాణించారని TGSRTC వెల్లడించింది. ఇందులో 2.51 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణాలు చేశారని తెలిపింది. పండుగ రోజున (AUG 9) 45.62 లక్షల మంది ప్రయాణించగా, ఈ నెల 11న అత్యధికంగా 45.94L మంది మహిళలతో సహా మొత్తం 68.45L మంది రాకపోకలు సాగించారని పేర్కొంది. ఒక్క రోజులో ఇంత మంది మహిళలు ప్రయాణించడం ఇదే తొలిసారి అని వివరించింది.
News August 13, 2025
అప్రమత్తంగా ఉండాలి: చంద్రబాబు

APలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు. వరద ప్రవాహాలను అంచనా వేసి ఎప్పటికప్పుడు ప్రజలకు సమాచారం ఇవ్వాలని వర్షాలపై సమీక్షలో ఆదేశించారు. ప్రకాశం బ్యారేజ్‌కు 5 లక్షల క్యూసెక్కుల వరద వచ్చే అవకాశం ఉండటంతో కృష్ణా నదీ పరివాహక ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. అలాగే కాలువలు, చెరువులకు గండ్లు పడకుండా గట్లు పటిష్ఠ పర్చాలని తెలిపారు.