News August 18, 2024

ఐఫోన్‌- 16 వచ్చేస్తోంది

image

సెప్టెంబర్‌లో జ‌ర‌గ‌నున్న యాపిల్ నెక్ట్స్ ఈవెంట్ ద్వారా ఐఫోన్‌- 16 మార్కెట్‌లోకి విడుద‌ల కానుంది. ఈ కొత్త సిరీస్‌లో 4 ఫోన్లతోపాటు Apple వాచ్ సిరీస్ 10, AirPods 4, మరిన్ని ప్రొడక్ట్స్‌ విడుద‌ల కానున్నాయి. కొత్త సిరీస్‌లో టైటానియం క‌ల‌రింగ్‌, ఫినిషింగ్ మ‌రింత మెరుగ్గా ఉండి, స్క్రాచ్ రెసిస్టెన్స్‌గా ఉంటుంద‌ని స‌మాచారం. ఐఫోన్ 16, ప్ల‌స్ మోడ‌ల్స్‌ ఏ18 బ‌యోనిక్ చిప్‌సెట్‌ ప్రాసెస‌ర్‌తో రానున్నాయి.

Similar News

News September 10, 2024

4 PHOTOS: విలయం తర్వాత విజయవాడ

image

AP: ఇటీవల వచ్చిన భారీ వరదలతో విజయవాడలోని పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. ఇప్పుడు వరద తగ్గిపోవడంతో ఇన్ని రోజులు నీటిలో మునిగిపోయిన వస్తువులు, వాహనాలు బురద పూసుకొని తేలాయి. ఎంతో మంది సామాన్యుల ఇళ్లలోని సామగ్రి, పుస్తకాలు, చిన్న చిన్న షాపుల్లోని వస్తువులు పూర్తిగా పాడైపోయాయి. వరదలు విజయవాడకు ఎంతలా గాయం చేశాయో పై ఫొటోల్లో చూసి అర్థం చేసుకోవచ్చు. PHOTOS – BBC

News September 10, 2024

కోలుకుంటున్న సూర్య.. బంగ్లాతో సిరీస్‌కు రెడీ!

image

బుచ్చిబాబు టోర్నమెంట్‌లో గాయపడిన T20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వేగంగా కోలుకుంటున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. దాదాపు 100 శాతం రికవరీ అయ్యారని తెలిపాయి. ప్రస్తుతం కొనసాగుతున్న దులీప్ ట్రోఫీలో ఇండియా-C తరఫున బరిలో దిగే అవకాశం ఉందని పేర్కొన్నాయి. బంగ్లాదేశ్‌తో అక్టోబర్ 6 నుంచి మొదలయ్యే 3 టీ20ల సిరీస్‌కు అతను అందుబాటులో ఉంటారన్నాయి.

News September 10, 2024

రేపు నందిగం సురేశ్‌ను పరామర్శించనున్న జగన్

image

AP: మాజీ సీఎం జగన్‌ రేపు గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. ‘ఉ.10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి గుంటూరు సబ్‌ జైలుకు చేరుకుంటారు. అక్కడ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను పరామర్శిస్తారు. అనంతరం ఎస్‌వీఎన్‌ కాలనీలో క్రోసూరు మార్కెట్‌ యార్డ్‌ మాజీ ఛైర్మన్‌ ఈద సాంబిరెడ్డి నివాసానికి వెళతారు. ఇటీవల టీడీపీ గూండాల దాడిలో తీవ్రంగా గాయపడిన ఆయనను పరామర్శిస్తారు’ అని వైసీపీ ఓ ప్రకటనలో తెలిపింది.