News November 16, 2024

IPL: ఒక్క ఆటగాడిపై 10 జట్ల కన్ను?

image

ఐపీఎల్ మెగా వేలంలో ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ కోసం పది జట్లు ఎదురుచూస్తున్నాయి. సాలిడ్ ఓపెనర్, స్మార్ట్ కెప్టెన్, సమర్థుడైన వికెట్ కీపర్ అతడు. మరోవైపు ప్రతి జట్టుకు ఓపెనరో, కెప్టెనో, వికెట్ కీపరో కావాల్సి ఉంది. దీంతో అన్ని లక్షణాలున్న బట్లర్‌ను దక్కించుకునేందుకు ఫ్రాంచైజీలు పోటీ పడతాయనడంలో సందేహం లేదు. మెగా ఆక్షన్‌లో ఆయన భారీ జాక్ పాట్ కొడతారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Similar News

News December 11, 2024

రేపటి నుంచి ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్

image

తెలంగాణ సచివాలయంలో డిసెంబర్ 12 నుంచి ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ అమలు కానుంది. సచివాలయంలో పనిచేసే అన్ని శాఖల అధికారులు, సిబ్బందికి దీనిని వర్తింపజేయనున్నారు. ఔట్ సోర్సింగ్, సచివాలయం హెడ్ నుంచి వేతనాలు పొందే ప్రతి ఉద్యోగికి తప్పనిసరిగా ఫేషియల్ అటెండెన్స్ అమల్లో ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

News December 11, 2024

గీతా పారాయణంలో గిన్నిస్ రికార్డు

image

మధ్యప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన గీతా పారాయణం గిన్నిస్ రికార్డు సాధించింది. ఇవాళ గీతా జయంతి సందర్భంగా 5వేల మందికి‌పైగా భక్తులు ‘కర్మ యోగ్’ అధ్యాయాన్ని పఠించారు. ఈ గిన్నిస్ రికార్డు సాధించడంపై సీఎం మోహన్ యాదవ్ సంతోషం వ్యక్తం చేశారు. మరోవైపు రాష్ట్రంలోని గోశాలలను ప్రభుత్వమే నిర్వహించాలని ఆయన నిర్ణయించారు.

News December 11, 2024

విప‌క్షాల మాదిరి ప్ర‌శ్నించ‌కండి అంటూ సెటైర్లు

image

మహారాష్ట్ర నాసిక్‌లోని ఓ హౌసింగ్ సొసైటీ విపక్ష రాజకీయ పార్టీలపై వ్యంగ్యాస్త్రాలు సంధించింది. Dec 15న జరగనున్న సొసైటీ ఎన్నికల్లో ప్రతిఒక్కరూ ఓటు వేయాలని అభ్యర్థిస్తూనే, ఓడిపోయిన వారు విపక్షాల మాదిరి ఎన్నికల ప్రక్రియపై ప్రశ్నలు లేవనెత్తవద్దని సూచించడం వైరల్‌గా మారింది. పోలింగ్‌పై భరోసా ఉంచాలని కోరింది. మూడేళ్లపాటు సొసైటీ బాధ్యతల్ని పర్యవేక్షించే కమిటీ ఎన్నికల్లో ప్రతి ఓటు ముఖ్యమని పేర్కొంది.