News March 5, 2025

IPL-2025: పూర్తిగా మారనున్న ఉప్పల్ స్టేడియం!

image

ఐపీఎల్ కోసం ఉప్పల్ స్టేడియం సిద్ధమవుతోంది. ఇక్కడ మొత్తం 9 మ్యాచులు జరగనున్నట్లు HCA ప్రెసిడెంట్ జగన్ మోహన్ పేర్కొన్నారు. ‘సీటింగ్ ప్రాంతాలను క్లీన్ చేసి ప్రేక్షకులకు ఆహ్లాదకర వాతావరణాన్ని అందించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. వాష్‌రూమ్స్‌ & కార్పొరేట్ బాక్సులు లగ్జరీగా మారుస్తున్నాం. 20వ తేదీలోపు స్టేడియం లుక్‌ను అందంగా తీర్చిదిద్దుతాం. విశిష్ట అతిథులకు గొప్ప అనుభవాన్ని అందిస్తాం’ అని తెలిపారు.

Similar News

News March 20, 2025

‘కోర్టు’ కలెక్షన్లలో తగ్గేదేలే..

image

‘కోర్టు’ మూవీ కలెక్షన్ల పర్వం కొనసాగుతోంది. విడుదలైన ఆరు రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.36.85 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది. అభిమానుల తీర్పుతో ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచిందని పేర్కొంది. రామ్ జగదీశ్ తెరకెక్కించిన ఈ మూవీలో ప్రియదర్శి, శివాజీ, హర్ష్ రోషన్, శ్రీదేవి కీలక పాత్రల్లో నటించారు.

News March 20, 2025

వారి ఉపాధి పరిరక్షణ బాధ్యత కూటమి ప్రభుత్వానిదే: జనసేన

image

AP: కొల్లేరు విధ్వంసంపై జనసేన ప్రకటన విడుదల చేసింది. కొల్లేరు సమస్య తీవ్రం కావడానికి రాజకీయాలే కారణమని పేర్కొంది. నాటి వైఎస్ ప్రభుత్వం ఆపరేషన్ కొల్లేరు పేరుతో చెరువు గట్లను పేల్చేసిందని దుయ్యబట్టింది. కొల్లేరుపై ఆధారపడిన వారి ఉపాధిని పరిరక్షించాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వానిదేనని పేర్కొంది. పర్యావరణాన్ని పరిరక్షించే సిద్ధాంతం తమదని తెలిపింది.

News March 20, 2025

శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. మరోవైపు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్టుమెంట్లలో వేంకటేశ్వర స్వామి భక్తులు దర్శనానికి వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 72,388 మంది దర్శించుకోగా.. 26,145 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.97 కోట్లు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.

error: Content is protected !!