News May 11, 2024
IPL.. DC జట్టుకు బిగ్ షాక్

ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్‌పై ఒక మ్యాచ్‌కి సస్పెన్షన్ వేటు పడింది. RRతో మ్యాచ్ సందర్భంగా స్లో ఓవర్ రేటు(గతంలో 2 సార్లు ఫైన్ వేశారు) కారణంగా అతనిపై ఈ నిషేధంతో పాటు బీసీసీఐ రూ.30 లక్షల ఫైన్ వేసింది. దీంతో రేపు RCBతో జరగాల్సిన మ్యాచ్‌కు అతను దూరం కానున్నారు. కీలకమైన ప్లే ఆఫ్స్‌కు ముందు DCకి ఇది బిగ్ షాక్‌గా చెప్పుకోవచ్చు. పాయింట్ల టేబుల్‌లో DC ప్రస్తుతం 5వ స్థానంలో ఉంది.
Similar News
News February 11, 2026
ఇవాళ వారికి వేతనంతో కూడిన సెలవు

TG: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కార్మిక శాఖ వేతనంతో కూడిన సెలవు ప్రకటించింది. పోలింగ్ జరిగే ప్రాంతాల్లోని ఫ్యాక్టరీలు, షాపులు, ప్రైవేట్ సంస్థల ఉద్యోగులకు ఇది వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆఫీసులు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు ఇప్పటికే సెలవు ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఉద్యోగులకు ‘స్పెషల్ క్యాజువల్ లీవ్’ సైతం మంజూరు చేసింది.
News February 11, 2026
రోజ్ మేరీ ఆయిల్‌తో జుట్టుకు ఎన్నో లాభాలు

నల్లని, ఒత్తయిన జుట్టు కావాలని ప్రతిఒక్కరూ కోరుకుంటారు. వాటికోసం మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ అన్నీ వాడతారు. వాటిల్లో ఒకటే రోజ్ మేరీ ఆయిల్. ఇందులో ఐరన్, క్యాల్షియం, విటమిన్ బి ఉంటాయి. దీనిని వాడటం వల్ల జుట్టు కుదుళ్లకు లోపలి నుంచి పోషణ లభిస్తుంది. జుట్టు నిగనిగలాడుతూ కాంతిమంతంగా మారుతుంది. జుట్టు పెరుగుదలలో చక్కటి ఫలితాలుంటాయి. త్వరగా పొడిబారే జుట్టు ఉన్నవారికి ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
News February 11, 2026
మీ ‘ఓటు’ ఎక్కడుందో తెలుసుకోండిలా

TG: మున్సిపోల్ నేపథ్యంలో ఓటర్ స్లిప్‌ను ప్రభుత్వ వెబ్‌సైట్ లేదా Te-Poll మొబైల్ యాప్ ద్వారా పొందవచ్చని EC తెలిపింది. <


