News January 23, 2025

IPL: KKRకు బిగ్ షాక్?

image

కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు బిగ్ షాక్ తగిలినట్లుగా తెలుస్తోంది. ఎంపీ తరఫున రంజీ ట్రోఫీలో ఆడుతూ ఆ జట్టు ప్లేయర్ వెంకటేశ్ అయ్యర్ తీవ్రంగా గాయపడ్డారు. కేరళతో జరిగిన మ్యాచులో ఆయన కాలిమడమకు తీవ్ర గాయమైనట్లు తెలుస్తోంది. గాయం నుంచి కోలుకునేందుకు సమయం పట్టొచ్చు. కాగా IPL మెగా వేలంలో రూ.23.75 కోట్లు వెచ్చించి వెంకటేశ్‌ను KKR కొనుగోలు చేసింది. ఈ సీజన్‌కు ఆయనను కెప్టెన్‌గా కూడా నియమిస్తారని వార్తలు వచ్చాయి.

Similar News

News February 9, 2025

బీజేపీ బలోపేతానికి కారణమే మీరు.. కేటీఆర్‌కు కోమటిరెడ్డి కౌంటర్

image

TG: ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం నేపథ్యంలో రాహుల్ గాంధీకి <<15396872>>అభినందనలు<<>> తెలిపిన కేటీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఫైర్ అయ్యారు. ఎంపీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించడం కోసం సొంత పార్టీకి సున్నా సీట్లు అందించిన గొప్ప నాయకత్వం ఆయనదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో బీజేపీ బలోపేతం కావడానికి బీఆర్ఎస్సే కారణమని కోమటిరెడ్డి ఆరోపించారు.

News February 9, 2025

16 నుంచి పెద్దగట్టు జాతర

image

TG: సూర్యాపేట జిల్లా చివ్వెంల(మ) దురాజ్‌పల్లి లింగమంతులస్వామి జాతరకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 16 నుంచి 20 వరకు ఇది జరగనుంది. మేడారం తర్వాత రెండో అతిపెద్ద జాతరగా పేరుగాంచిన ఈ వేడుకకు ఏపీ, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తమిళనాడు నుంచి లక్షల మంది వస్తారు. అటు జాతరకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

News February 9, 2025

భార్యను నరికిన ఘటనలో మరో సంచలనం!

image

TG: హైదరాబాద్ మీర్‌పేట్‌లో భార్యను ముక్కలుగా నరికిన <<15262482>>ఘటనలో<<>> మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. వెంకటమాధవిని చంపేందుకు భర్త గురుమూర్తికి మరో ముగ్గురు కుటుంబీకులు సహకరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వారిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారని భావిస్తున్నారు. ఆ ముగ్గురు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు శనివారం నుంచి గురుమూర్తిని కస్టడీలోకి తీసుకొని మరింత లోతుగా విచారిస్తున్నారు.

error: Content is protected !!