News March 21, 2025

IPL: కోహ్లీ రికార్డును బ్రేక్ చేయగలరా?

image

రేపటి నుంచి అతిపెద్ద క్రికెట్ పండుగ IPL మొదలు కానుంది. ఈ టోర్నీలో ఆరెంజ్, పర్పుల్ క్యాప్స్ గెలుచుకునేదెవరనే దానిపై క్రీడాభిమానులు చర్చించుకుంటున్నారు. అలాగే కోహ్లీపై ఉన్న అత్యధిక రన్స్ రికార్డును ఎవరైనా బ్రేక్ చేయగలరా? అనేదానిపై చర్చ జరుగుతోంది. కోహ్లీ 2016 IPLలో 973 రన్స్ చేశారు. ఆ తర్వాతి స్థానాల్లో గిల్ (890), బట్లర్(863), వార్నర్(848) ఉన్నారు. కోహ్లీ రికార్డును ఎవరు బ్రేక్ చేయగలరు? COMMENT?

Similar News

News April 23, 2025

నా హృదయం ముక్కలైంది: రోహిత్ శర్మ

image

పహల్‌గామ్ ఉగ్రదాడిని టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఖండించారు. తన హృదయం ముక్కలైందనే భావన వ్యక్తపరుస్తూ బ్రోకెన్ హార్ట్ ఎమోజీని ఆయన తన ఇన్‌స్టాలో క్యాప్షన్‌గా పెట్టారు. అలాగే ఈ దాడిని పలువురు సెలబ్రిటీలు కూడా ఖండించారు. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, షారుఖ్ ఖాన్, ప్రియాంక చోప్రా, అక్షయ్ కుమార్, వరుణ్ ధావన్, అలియా భట్, కరీనా కపూర్ తదితరులు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు.

News April 23, 2025

IND, PAK మధ్య ఇక క్రికెట్ వద్దు: మాజీ క్రికెటర్

image

పహల్‌గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో PAKపై IND మాజీ క్రికెటర్ శ్రీవత్స్ గోస్వామి ఫైరయ్యారు. అమాయకులను చంపడమే ఆ దేశ జాతీయ క్రీడగా మారిపోయిందని మండిపడ్డారు. IND, PAK మధ్య ఇక ఎప్పటికీ క్రికెట్ మ్యాచులు నిర్వహించవద్దని BCCIని కోరారు. కొన్ని నెలల క్రితం తాను పహల్‌గామ్ వెళ్లానని, అప్పుడు అక్కడ శాంతి నెలకొన్నట్లు కనిపించిందని గుర్తు చేసుకున్నారు. CT కోసం పాక్‌కు IND జట్టును BCCI పంపకపోవడాన్ని సమర్థించారు.

News April 23, 2025

త్రివిధ దళాధిపతులతో రాజ్‌నాథ్ కీలక భేటీ

image

కశ్మీర్‌లోని పహల్‌గామ్‌లో ఉగ్రదాడికి బదులు తీర్చుకోవాలని యావత్ భారత్ కోరుకుంటోంది. ఈ క్రమంలోనే త్రివిధ దళాధిపతులతో డిఫెన్స్ మినిస్టర్ రాజ్‌నాథ్ సింగ్ కీలక భేటీ నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది. J&Kలో ప్రస్తుత పరిస్థితి, ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్‌పై NSA అజిత్ దోవల్, ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది, ఎయిర్‌ఫోర్స్ చీఫ్ AP సింగ్, నేవీ చీఫ్ దినేశ్ త్రిపాఠితో రాజ్‌నాథ్ చర్చించారు.

error: Content is protected !!